ఈ రోజు నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు..

శివరాత్రి వస్తుందంటే చాలు శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారి మోగిపోతుంటాయి.శివరాత్రికి ముందే ప్రముఖ శైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

 Shivratri Brahmotsavam In Srisaila Shrine From Today , Shivratri Brahmotsavam  ,-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది.ప్రతి సంవత్సరం శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా, వైభవంగా నిర్వహిస్తారు.

శివరాత్రిని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలంలో ఈ రోజు నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఇవాళ ఉదయం 9 గంటలకు శ్రీ స్వామివారికి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఇంకా చెప్పాలంటే ఈరోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ చేస్తున్నారు.

Telugu Bakti, Devotional, Shaiva Kshetras, Shivratri, Srisaila Shrine, Srisailam

బ్రహ్మోత్సవాల సమయంలో 11 రోజులపాటు స్వామి అమ్మవార్లకు వివిధ సేవలు నిర్వహిస్తారు.మహాశివరాత్రి రోజున సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు.అదే సమయంలో స్వామి వారికి పాగాలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది.

లింగోద్భవ కార్యక్రమం తర్వాత స్వామి అమ్మవారికి కల్యాణోత్సవం చేస్తారు.

Telugu Bakti, Devotional, Shaiva Kshetras, Shivratri, Srisaila Shrine, Srisailam

బ్రహ్మోత్సవాల్లో భాగంగా చాలా సేవలు నిర్వహించనున్నారు.11వ తేదీన ధ్వజ రోహణ, 12 న భృంగి వాహన సేవ, 13న హంస వాహన సేవ, 14న మయూర వాహన సేవ, 15న రావణ వాహన సేవా, 16 న పుష్పపల్లకీ సేవ, 17న గజ వాహన సేవా, 18న మహాశివరాత్రి ప్రభోత్సవం, నంది వాహన సేవా, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు.19 రథోత్సవం, తెప్పోత్సవం,20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి ఆస్థాన సేవ 21న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం అధికారులు ఘనంగా నిర్వహిస్తారు.ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube