నెలసరి సమయం వస్తుందంటేనే ఆడవారు ఎంతగానో హైరానా పడిపోతుంటారు.ముఖ్యంగా కొందరు నెలసరి సమయంలో రకరకాల నొప్పులను ఫేస్ చేస్తుంటారు.
నాలుగు రోజుల పాటు తీవ్ర వేదన అనుభవిస్తారు.నెలసరి వచ్చినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి.
ఫలితంగా కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్లు నొప్పి వంటివి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి.నెలసరి సమయంలో నొప్పుల నుంచి ఉపశమనం పొందడం కోసం ఎక్కువ శాతం మంది పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.
కానీ సహజంగా కూడా ఈ నొప్పులను దూరం చేసుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ వాటర్ అద్భుతంగా సహాయపడుతుంది.నెలసరి సమయంలో ఖాళీ కడుపుతో ఈ హెర్బల్ వాటర్ తాగితే నొప్పులకు దూరంగా ఉండవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం హెర్బల్ వాటర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఎనిమిది నుంచి పది ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఆపై మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

నెలసరి సమయంలో ఉదయం ఖాళీ కడుపుతో ఈ హెర్బల్ వాటర్ ను సేవించాలి.తద్వారా నెలసరి సమయంలో వేధించే నొప్పులన్నీ పరార్ అవుతాయి.చిరాకు, కోపం, ఆందోళన, ఒత్తిడి వంటివి దూరమవుతాయి.మనసు, మెదడు ప్రశాంతంగా మారతాయి.నెలసరి సమయంలో చాలా మంది గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలతో బాధపడుతుంటారు.అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా పైన చెప్పుకున్న హెర్బల్ వాటర్ ఉత్తమంగా సహాయపడుతుంది.
కాబట్టి, నెలసరి సమయంలో తప్పకుండా ఈ హెర్బల్ వాటర్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.