మోనికా బేడి. పేరు ఎంతో మంది సినీ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఇక ఇలా మంచి కెరియర్ కొనసాగుతున్న సమయంలో మోనికా బేడి తీసుకొన్న నిర్ణయం జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంది.ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాను అంటూ చెప్పగానే గుడ్డిగా నమ్మి కెరియర్ కూడా వదిలేసి అతనితో వెళ్ళిన మోనికా బేడి ఎన్నో రోజుల పాటు జైలు ఖైదీ జీవితాన్ని గడిపింది.
ఒకసారి మోనికా బేడీ జీవితం లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టించే ఘటనలు ఎన్నో ఉన్నాయి.ఇక వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మోనికా జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ప్రేమ గుడ్డిది అని విన్నాము కానీ మరీ ఇంత గుడ్డిది అని మాత్రం అనుకోలేదు అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి.1998లో తొలిసారి మోనికాకు అబూ సలీం అనే వ్యక్తి తప్పుడు పేరు చెప్పి పరిచయమయ్యాడు.తాను ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ అంటూ ఎన్నో మాటలు చెప్పాడు.ఆ తర్వాత ఫోన్ నెంబర్ తీసుకోవడం ఇక తరచు ఫోన్లో మాట్లాడటం చేశాడు.
ఇక తన మాటలు నమ్మి నిండా మునిగిపోయిన మోనికా బేడి రోజు అతనితో గంటలతరబడి మాట్లాడటం మొదలు పెట్టింది.
ఈ క్రమంలోనే అతని కోసం దుబాయ్ వెళ్ళింది.తన పేరు గురించి నిజం చెప్పిన అబూసలీమ్ ఇక వ్యాపారం గురించి నిజాన్ని బయట పెట్టలేదు.దీంతో ప్రేమ మత్తులో ఉన్న మోనికా బేడి అవన్నీ పట్టించుకోలేదు.
ఇక విడాకులు అయ్యి ఒంటరిగా ఉంటున్నాను అంటూ చెప్పి మోనికా సానుభూతిని సంపాదించుకున్నాడు.అబూసలిం పిలవడంతో అమెరికా వెళ్ళిన మౌనిక మళ్లీ ఇండియాకు తిరిగి రాలేదు.
ఇక అప్పటి నుంచి అబూసలీమ్ చేతిలో బందీ గా మారిపోయింది మోనికా.
ఎక్కడో మోసపోతున్న అనిపించినప్పటికీ ప్రేమ గుడ్డిది అంటారు కదా అందుకే అతని వదిలించుకుని రాలేకపోయింది మోనికా బేడి.అంతేకాదు ఒకానొక సమయంలో మోనికా బేడి వదిలించుకోవాలని నిర్ణయించుకుంటే ఇక పాస్పోర్ట్ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశాడట అబూసలీమ్.అయితే సినిమాలు వదిలేసి అబూ సలీం తో ఎంతో చాలా రిచ్ గా బతుకుతుంది అని అందరు అనుకున్నారు.
కానీ అతని కోసం ఏకంగా ఇంట్లో వంట చేయడం బాత్రూంలు కడగటం కూడా చేసిందట.ఇక 2002లో దొంగ పాస్పోర్టుల ఆరోపణలతో మోనికా అబూ సలీం అరెస్ట్ అయిన సమయంలో ఎంతో సంతోష పడి పోయింది ఆమె.ఆ తర్వాత 2010 వరకు జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడుపుతూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.