ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలలో ఆరోగ్యం పై శ్రద్ధ కాస్త పెరిగింది అని చెప్పాలి.ఎందుకంటే వారు తీసుకునే ఆహారంలోనే శరీరానికి కావలసిన విటమిన్లను, పోషకాలను అందేలా చూసుకుంటూ ఉన్నారు.
అంతేకాకుండా ఎండుద్రాక్షను కూడా చాలామంది ప్రజలు తరచుగా తింటూనే ఉంటారు.వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది ప్రజలకు తెలుసు.
వైద్యులు కూడా ఎండు ద్రాక్షను ఆహారంలో భాగం చేసుకోమని చెబుతూ ఉంటారు.ఎండు ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో ఐరన్ స్థాయి పెరిగి జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుంది.
అంతేకాకుండా ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.
ఇంకా చెప్పాలంటే వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
అంతేకాకుండా ఏ ఆహార పదార్థాలు అయినా అతిగా తింటే మాత్రం ప్రమాదమే అని పెద్దవారు చెబుతూనే ఉంటారు.ఎండు ద్రాక్షలు కూడా అంతే వీటి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అతిగా తింటే అన్నే అనర్థాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండు ద్రాక్షను అతిగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు షుగర్ లెవెల్స్ పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది
.

అంతేకాకుండా ఎండుద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.అయితే వాటిని ఎక్కువగా తినడం వల్ల ఇతర పోషకల శాతం తగ్గే అవకాశం ఉంది.ఎక్కువ నీరు తీసుకోకుండా ఎండుద్రాక్ష ఎక్కువగా తినడం వల్ల డిహైడ్రేషన్, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.
ఎండుద్రాక్ష అంటే సహజంగానే తీపి పదార్థం కాబట్టి ఇందులో అధిక చెక్కర ఉంటుంది.కాబట్టి డయాబెటిస్ బాధపడేవారు ఎండు ద్రాక్ష ను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎండు ద్రాక్ష లో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు వీటిని అసలు తినకూడదు.ఒకవేళ తినాలి అనుకుంటే మాత్రం తగిన మోతాదులో తినడమే మంచిది.