చేప‌కు వ‌లేసిన చిన్నారి.. మెరుపు వేగంతో అటాక్ చేసిన మొస‌లి

చేపలు ప‌ట్ట‌డం అంటే ఒక మంచి టైమ్‌పాస్ లాగా ఫీల్ అవుతుంటారు చాలామంది.ఫిషింగ్‌కు పిల్లలను తీసుకెళ్తే వారు కూడా చాలా సంతోషిస్తారు.

 A Child Who Is Addicted To Fish .. A Crocodile That Attacks With Lightning Speed-TeluguStop.com

మ‌న‌కు కూడా వేటాడుతున్న పీలింగ్ క‌లుగుతుంది.మ‌నం వేసిన గాలానికి చేప‌లు ప‌డితే గ‌న‌క ఆ మ‌జా వేరే లెవ‌ల్ అని చెప్పాల్సిందే.

అయితే ఇలా చేప‌లే ప‌ట్టే స‌మ‌యంలో కొన్నిసార్లు వేరే వి కూడా వ‌ల‌కు చిక్కుతుంటాయి.ఇలా ఇత‌ర జంతువులు వ‌ల‌కు చిక్కిన ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తుంటాయి.

ఇప్ప‌డు కూడా ఇలాంటి దాని గురించే తెలుసుకుందాం.

అదేంటంటే మెక్‌మహాన్ అనే వ్యక్తి త‌న కొడుకును ఇలాగే టైమ్ పాస్ కోసం ద‌గ్గ‌ర‌లోని కొల‌ను ద‌గ్గ‌ర‌కు చేప‌లు ప‌ట్టేందుకు తీసుకెళ్తాడు.

ఇక అది తెలిసిన అత‌డి కొడుకు ఎంతో సంతోషించి తాను కూడా చేప‌లు ప‌ట్టేందుకు రెడీ అయిపోతాడు.అయితే ఆ పిల్లాడు ఎంతో సంతోషంగా చేప‌ల వేట‌కు వెళ్తే అక్క‌డ జ‌రిగిన పరిణామం అత‌నికి షాక్ క‌లిగించింది.7 ఏళ్ల ఆ చిన్నారి డాసన్ చేప‌ల కోసం గాలం వేస్తాడు.అయితే తండ్రీ కొడుకుల‌కు ఆ కొల‌నులో మొసలి ఉందని మాత్రం తెలియదు.

అలాగే చేప‌లు ప‌డుతుండ‌గా స‌డెన్‌గా గాలానికి ఓ చేప ప‌డుతుంది.

ఇంకేముంది ఆ చిన్నారి ఎంతో సంతోషిస్తాడు.ఇక చేప‌ను బుట్ట‌లో వేసుకునేందుకు చేపను ఒడ్డుకు లాగాడు గాలాన్ని.ఇంత‌లో ఓ మొసలి మెరుపు వేగంతో ఆ చిన్నారివైపు దూసుకొచ్చింది.

అయితే ఆ చిన్నారిని కాకుండా ఆ గాలానికి చిక్కిన చేపను అమాంతం నమిలేసింది.దీంతో ఇదంతా చూసిన డాసన్ ఒక్క ఉదుట‌న వెనక్కి పారిపోయి ప్రాణాల‌ను క‌పాడుకున్నాడు.ఇదంతా షూట్ చేసిన త‌న తండ్రి సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేయ‌గా 50 సెకన్ల నిడివి ఉన్న దీనికి ఇప్ప‌టికే 1.99 లక్షల వ్యూస్ వ‌చ్చేశాయి.2.7 వేల లైకు వ‌ర్షం కురిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube