తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎవరెస్టు శిఖరాన్ని తాకిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా దర్శకుడిగా నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను నిర్మించిన రాఘవేంద్రరావు ప్రస్తుతం నటుడిగా మారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈక్రమంలోనే తనికెళ్ళ భరణి దర్శకత్వంలో బాలు గారు నటించిన మిధునం సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునీ అవార్డులను సొంతం చేసుకుందో మనకు తెలిసిందే.
ఈక్రమంలోనే తనికెళ్ల భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా ఈ సినిమా కాకుండా రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బాస్, ఆట వంటి చిత్రాలకి దర్శకుడిగా పనిచేసిన వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రాఘవేంద్రరావు మరో సినిమాను చేయబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆదిత్య రాఘవేంద్రరావు కోసం కథను సిద్ధం చేయగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.60 సంవత్సరాల వ్యక్తి ప్రేమకథ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.అయితే ప్రస్తుతం రాఘవేంద్ర రావు నటిస్తున్న తనికెళ్ల భరణి సినిమా పూర్తి అయిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన రాఘవేంద్రరావుకు ప్రస్తుతం నటనపై ఆసక్తి కలగడం చేత పలు సినిమాలలో సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కుతున్న పెళ్లిసందD సినిమాలో వశిష్ట అనే పాత్ర ద్వారా రాఘవేంద్రరావు ప్రేక్షకులను సందడి చేయనున్నారు.