చలికాలం రానే వచ్చింది.ఈ సీజన్ లో ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో జలుబు, దగ్గు ముందు వరుసలో ఉంటాయి.
పైగా ఇవి ఒక్కసారి పట్టుకున్నాయంటే ఓ పట్టాన అస్సలు వదిలి పెట్టవు.జలుబు, దగ్గు కారణంగా చాలా మంది ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడుపుతుంటారు.
అయితే జలుబు, దగ్గు ( Cold cough )వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ పొడిని చలికాలంలో రోజు ఉదయం తీసుకుంటే జలుబు, దగ్గు మీ వంక కూడా చూడవు.ఇంతకీ ఆ పొడి ఏంటా అని ఆలోచిస్తున్నారా. త్రిఫల పొడి( Triphala powder ).ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ.ఈ మూడింటిని కలిపి త్రిఫల పొడిని తయారు చేస్తారు.త్రిఫల పొడి లో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటాయి.ఆయుర్వేద వైద్యంలో అనేక రోగాలకు మందుగా త్రిఫల పొడిని వాడుతుంటారు.ఆరోగ్యపరంగా త్రిఫల పొడి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ముఖ్యంగా ప్రస్తుత ఈ చలికాలంలో త్రిఫల పొడిని ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ త్రిఫల పొడి వేసి నిండా వాటర్ పోసి మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి.
మరుసటి రోజు ఆ వాటర్ లో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి,( Cinnamon powder ) వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )వేసుకుని బాగా కలిపి సేవించాలి.ఈ విధంగా త్రిఫల పొడిని రోజు ఉదయం తీసుకుంటే చాలా మంచిది.

త్రిఫల పొడిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.ఒకవేళ జలుబు, దగ్గు సమస్యలు ఉంటే వాటిని వేగంగా తరిమికొడుతుంది.అంతేకాదు త్రిఫల పొడిని పైన చెప్పిన విధంగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్య దూరం అవుతుంది.కడుపులో నులిపురుగులు ఏమైనా ఉంటే నాశనం అవుతాయి.
మరియు జీర్ణ వ్యవస్థ పనితీరు సైతం మెరుగ్గా సాగుతుంది.