ఖమ్మంలో ఖాతా తెరచిన టీ.ఆర్.ఎస్.. 10వ డివిజన్ ఏకగ్రీవ ఎన్నిక..!

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహణకు ముందే ఒక డివిజన్ లో టీ.ఆర్.

 Trs Won 10th Division Corporation Elections, 10th Division,  Corporation Electio-TeluguStop.com

ఎస్ ఏకగ్రీవంగా విజయం సాధించింది.మొత్తం 60 డివిజన్లు ఉన్న ఖమ్మం కార్పొరేషన్ లో 10వ డివిజన్ నుండి టీ.ఆర్.ఎస్ తరపున చావా మాధురి నామినేషన్ వేశారు.అయితే ఇతర పార్టీలైన కాగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్దులు ఈ డివిజన్ తరపున నామినేట్ వేయగా నామినేషన్లు విత్ డ్రాలో గురువారం బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్ధి కూడా నామినేషన్స్ విత్ డ్రా చేసుకోగా టీ.ఆర్.ఎస్ అభ్యర్ధి చావా మాధురి ఏకంగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ నెల 20న కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉండగా టీ.

ఆర్.ఎస్ ఏకగ్రీవ ఎంపికతో ఖాతా తెరచింది.ఇక 30వ తారీఖు మిగిలిన 59 డివిజన్లకు ఎలక్షన్స్ జరుగనున్నాయి.ఈ సందర్భంగా 10వ డివిజన్ లో ఏకగ్రీవంగా ఎంపికైన చావా మాధురి, మాజీ కార్పొరేటర్ చావా నారాయణరావు దంపుతులు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిశారు.ఖమ్మం లో బోణీ కొట్టినందుకు చావా దంపతులకు అభినందించారు.60 డివిజన్లు ఉన్న ఖమ్మం కార్పొరేషన్ లో 417 మంది అభ్యర్ధులు మొత్తం 522 నామినేషన్లు వేశారు.టీ.ఆర్.ఎస్ నుండి 163, బీజేపీ నుండి 84, కాంగ్రెస్ 125, సీపీఎం 35, సీపీఐ 7, టీడీపి 16, ఇతర పార్టీలు 16, స్వతంత్ర అభ్యర్ధులు 76 మంది నామినేషన్స్ వేశారు.అయితే వీటిలో 9 నామినేషన్స్ ను అధికారులు తిరస్కరించగా 405 మంది అభ్యర్ధులు మిగిలారు.

గురువారం నామినేషన్ల ఉపసం హరన సమయానికి 155 మంది అభ్యర్ధులు విత్ డ్రా చేసుకున్నారు.బరిలోకి మొత్తం 251 మంది అభ్యర్ధులు దిగుతున్నారు.వారిలో టీ.ఆర్.ఎస్ 57, బీజేపీ 47, సీపీఐ 3, కాంగ్రెస్ 48, టీడీపీ 8, ఇతర పార్టీలు 12 స్వతంత్రులు 67 మంది పోటీలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube