ఇక ఆధార్ సేవలు పొందడానికి గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం లేదు.కొన్ని సేవలను ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండానే సులువుగా చేసుకోవచ్చు.
పైగా ఆధార్ సేవలు పొందడానికి ఇంటర్నెట్ అవసరం లేదు.ఎస్‌ఎంఎస్ ద్వారా అనేక సేవల్ని పొందొచ్చు.
ఆ వివరాలు తెలుసుకుందాం.స్మార్ట్‌ఫోన్ ఉంటే ఈ కాలంలో ఏపనైనా చిటికెలో పూర్తవుతుంది.
అందుకు నిదర్శనమే ఈ ఆధార్ సేవలు.ఇలా ఇంటర్నెట్ లేకుండా సేవలు పొందడం కొంతమందికే తెలుసు! కేవలం మీ ఫోన్‌లో ఎస్‌ఎంఎస్ బ్యాలన్స్ ఉంటే చాలు.
యూఐఏఐ ఎస్‌ఎంఎస్ ద్వారా ఆధార్ సేవల్ని అందిస్తోంది.ఈ సేవలను పొందడానికి ఆధార్ కార్డ్ హోల్డర్లు 1947 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి.
వేర్వేరు సేవలకు వేర్వేరు ఫార్మాట్లలో ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.ఎస్‌ఎంఎస్ ద్వారా వర్చువల్ ఐడీ జనరేట్ లేదా రిట్రీవల్ చేయొచ్చు.
అలాగే ఆధార్ నెంబర్ లాక్, అన్ లాక్ చేయొచ్చు.
బయోమెట్రిక్ లాక్‌ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయొచ్చు.
ఇలా ప్రతీ సేవకు యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్‌లో ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 1234–5678–9123 అనుకుంటే ఎస్‌ఎంఎస్ ఎలా పంపాలో తెలుసుకోండి.
వర్చువల్ ఐడీ జనరేట్ చేయడానికి GVI ఈ అని టైప్ చేసి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 అంకెల్ని టైప్ చేసి ఎస్‌ఎంఎస్ పంపాలి.అంటే GVI ఈ 9123 అని టైప్ చేయాలి.
వర్చువల్ ఐడీని రీట్రీవ్ చేయడానికి RVI ఈ 9123 అని టైప్ చేయాలి.ఇక వన్ టైమ్ పాస్‌వర్డ్ పొందడానికి GETOTP 9123 అని టైప్ చేయాలి.

