ఇటీవల టెక్నాలజీతో కూడుకున్న అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు( Electronic Gadgets ) మార్కెట్ లోకి విపరీతంగా అందుబాటులోకి వస్తున్నాయి.వీటి వల్ల మన పని కూడా చాలా సులువవుతుంది.
ఇంట్లో ఉపయోగించే బల్బులు, స్విచ్‌లు, ట్యాప్‌లతో పాటు అనేక వస్తువులు సెన్సార్ టెక్నాలజీతో నడిచేవి ఇటీవల వస్తున్నాయి.వీటి వల్ల కరెంట్, నీళ్లు ఆదా అవుతాయి.
అంతేకాకుండా మనం ఉపయోగించడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

అయితే తాజాగా మార్కెట్ లోకి ఒక ఎలక్ట్రానిక్ పరికరం వచ్చింది.సెన్సార్ తో పనిచేసే ఈ పరికరాన్ని మీ ఇంటి డోర్ కు బిగించుకుంటే సరిపోతుంది.ఎవరైనా మీ ఇంటి డోర్ ని( Door ) తెలిస్తే మీ మొబైల్ ఫోన్ కు వెంటనే నోటిఫికేషన్ ( Notification ) వస్తూ ఉంటుంది.
మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు, వేరే ప్రదేశానికి వెళ్లినప్పుడు ఇంట్లో దొంగలు పడకుండా కాపాడుకునేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది.అలాగే రూములు, హాస్టళ్లల్లో ఉండే బ్యాచిలర్స్ కోసం టర్బైన్ వాషింగ్ మెషిన్ అందుబాటులోకి వచ్చింది.
ఇది చాలా చిన్నగా ఉంటుంది.యాన్ స్టార్ అనే కంపెనీ దీనిని తయారుచేసింది.

ఈ మినీ అల్ట్రాసోనిక్ టర్బైన్ వాషింగ్ మెషిన్( Mini Ultrasonic Turbine Washing Machine ) చాలా సులువుగా, తేలికగా ఉంటుంది.దీంతో ట్రావెలింగ్ లో తీసుకెళ్లడానికి కూడా సౌకర్యంతంగా ఉంటుంది, ఒక బకెట్ లో నీళ్లు, డిటర్జెంట్ వేసిన తర్వాత గాడ్జెట్ ని అందులో ఫిక్స్ చేయాలి.ఆ తర్వాత ఉతకాల్సిన బట్టలు వేస్తే సరిపోతుంది.ఒక కిలో బట్టలు ఇది ఒకేసారి ఉతుకుతుంది.దీని ధర రూ.999గా ఉంది.అలాగే వైర్ లెస్ మైక్రోఫోన్ కూడా మార్కెట్ లోకి వచ్చింది.దీని ద్వారా వీడియోలు తీసేటప్పుడు వాయిస్ ని మంచి క్వాలిటీతో రికార్డ్ చేసుకోవచ్చు.గ్రెనరీ కంపెనీ ఈ మైక్రోఫోన్ ను ఇటీవల విడుదల చేసింది.








