వింత గ్రామం: అక్కడ అందరూ గుహలలోనే నివాసం.. ఎక్కడంటే..?!

మనం అందరం ఇళ్ళు భూమి మీద నిర్మించు కుంటూ ఉంటాము.కానీ అక్కడి ప్రజలు మాత్రం భూమి లోపల గుహల్లో నివసిస్తూ ఉంటారు.అయితే అక్కడ నివసించే ప్రజల గురించి చాలాకాలం పాటు ఎవరికీ తెలియదు.1969 వ సంవత్సరం వరకు ప్రపంచంలోని ఎవరికీ కూడా అసలు అలాంటి గ్రామం ఒకటి ఉందనే విషయం కూడా ఎవరికీ తెలియదు.కానీ 1969 వ సంవత్సరం తరువాత భూగర్భంలో నిర్మించిన ఇళ్ల గురించి అందరికి తెలిసాయి.అది ఎలా అంటే 1969 వ సంవత్సరంలో వచ్చిన భారీ వరదల కారణంగా భూగర్భంలో నిర్మించిన ఇళ్లు నీటితో నిండిపోయినప్పుడు ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది.

 Strange Village Everyone There Lives In Caves Village, Latest News, Viral Latest-TeluguStop.com

అప్పుడు హుటాహుటిన ఆ గ్రామంలోని బాధిత ప్రజలను అక్కడి నుండి కాళీ చేయించి వేరే చోటికి తరలించారు.మళ్ళీ కొన్నాళ్ళకు ఆ గ్రామస్తులు తిరిగి అవే గుహలలోకి వెళ్లి నివాసం ఉంటున్నారు.

ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా.ఈ గ్రామం ట్యునీషియాకి దక్షిణ భాగంలో ఉంది.

ఈ గ్రామం పేరు మత్మత.ఈ గ్రామంలో నివసించే ప్రజలు అందరికంటే భిన్నంగా నివాసిస్తారు.ఇక్కడ భూమి కింద లోతైన గుహలు ఉన్నాయి.అందులోనే వాళ్ళు నివసిస్తారు.ప్రస్తుతం ఈ ప్రదేశం ఇప్పుడు ఒక పర్యాటక కేంద్రంగా మారి పోయింది.ఇలాంటి గుహలను మీరు సినిమాల్లో చూసి ఉంటారు .స్టార్ వార్‌తో సహా కొన్ని రకాల హాలీవుడ్ చిత్రాలను ఇక్కడే చిత్రీకరించడం జరిగింది.ఈ భూగర్భ గుహలలో అక్కడి ప్రజలు ఎందుకు నివసిస్తున్నారనే దానిపై అక్కడి గ్రామస్తులు ఇలా చెప్పుకొచ్చారు.

ఈ ఇళ్లు మాకు చాలా ముఖ్యమైనవి.ఈ ఇళ్లలో ఉంటే చలి, ఎండ నుంచి మాకు రక్షణ ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

ఇక్కడ మాకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని కరెంట్ తో పాటు టెలివిజన్ సౌకర్యం కూడా ఉందని చెప్పుకొచ్చారు.

ఈ గ్రామస్థుల జీవన శైలి గురించి తెలిసి పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో ఈ గ్రామానికి తరలివస్తున్నారు.పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో ఇక్కడి గ్రామస్తులు తమ ఇళ్లలోని కొన్ని గదులను హోటళ్లుగా మార్చేశారు.ఇప్పుడు అదే వారికి ఆదాయ మార్గంలా మారింది.

ఇదిలా ఉండగా ఈ గ్రామానికి చెందిన 46 ఏళ్ల మోంజియా మాట్లాడుతూ తాను ఈ ఇంటిని వదిలి ఎక్కడికీ వెళ్లాలని అనుకోవడంలేదని తేల్చి చెప్పేసారు.ఈ ప్రాంతంలో లభించే ప్రశాంతత మరెక్కడా దొరకదని అన్నారు.

అలాగే గ్రామస్తులు కూడా వేరే చోటుకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు సరి కదా.ఇదే తమకు చాలా సురక్షితమైన ప్రదేశం అని అంటున్నారు.

Village Families Living in Tunisias Underground Houses

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube