ప్రపంచ శాస్త్రవేత్తలు రోబోటిక్స్ అభివృద్ధి పైన కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూ వున్నారు.ఇప్పటికే వీటిని వివిధ రంగాలలో మనుషులకు ప్రత్యామ్నాయాలుగా వాడుతున్న సంగతి తెలిసినదే.
కొత్త కొత్త టెక్నాలజీలతో మనవాళ్ళు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు.ముఖ్యంగా ఏఐ టెక్నాలజీతో రూపొందించిన చాట్ జీపీటీ ఇప్పుడు ప్రపంచంలో ట్రెండింగ్ గా మారుమ్రోగిపోయిన సంగతి విదితమే.
మనకు ఏ సందేహం వచ్చినా చాట్ జీపీటీని అడిగితే సమాధానం సెకెనుల వ్యవధిలో అందిస్తుంది.దీంతో పాటు రోబోల తయారీలో కూడా దీని సాయం తీసుకుంటున్నారు.

అవును, ఈ క్రమంలో అచ్చం మనిషినిపోలే రోబోలను (Robots) తయారు చేస్తున్నారు.అంటే మనుషులు చేసే పని ఇక్కడ రోబోలు చేసేస్తాయన్నమాట.ఈ నేపథ్యంలో తాజాగా దేవుడికి పూజలు ( Pooja ) చేయడానికి కూడా రోబోలను తయారు చేశారు.ఆశ్చర్యంగా వుంది కదూ.మీరు విన్నది నిజమే.ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఈ రోబోలు దేవుడికి పూజలు కూడా పంతుళ్ళ మాదిరి చేస్తున్నాయి.2017లో, భారతదేశంలోని ఒక సాంకేతిక సంస్థ క్వార్ట్జ్‌కు గణపతి ఉత్సవంలో హారతి ఇవ్వడానికి రోబోటిక్ చేతిని( Robotic Arm ) ఆవిష్కరించిన సంగతి విదితమే.

ఇలా చెప్పుకుంటూ పొతే ఇలాంటి కొన్ని ఘటనలు మనం చూడవచ్చును.కేరళలోని ఒక దేవాలయం తన ఆచారాలను నిర్వహించడానికి రోబోటిక్ ఏనుగును ప్రవేశ పెట్టిన సంగతి ఆ మధ్య విన్నాం.ఇపుడు తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కాగా దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది దీనిని అద్భుతమైన ఆవిష్కరణ అంటూ పొగిడేస్తుంటే, మరికొందరు ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అంటే ఇదే.లేదంటే ఏకంగా దేవుడి పూజ కోసం రోబోలు వాడడం ఏమిటి? అని అంటున్నారు.ఓ వర్గవారు రోబోలు పూజలు చేసేస్తే ఇక పూజారులు భజన చేసుకోవలసిందే అని చెవాక్కులు విసురుతున్నారు.







