వీడియో వైరల్: ఈ దొంగ తెలివి చూస్తే షాకవ్వాల్సిందే.. చిన్న కిటికీ ద్వారా ఏం చేశాడంటే..

64 కళల్లో చోర కళ కూడా ఒకటి అని పెద్దలు అంటుంటారు.ఎందుకంటే చోరీ చేయడంలో బీభత్సమైన తెలివి, నైపుణ్యం, నేర్పు ఉండాలి.

 Viral Video Thief Shows How Enters Home Through Tiny Windows Details, Viral Vide-TeluguStop.com

లేదంటే దొంగతనం చేయలేకపోవడం అటుంచితే కటకటాల పాలవ్వడం ఖాయం.అయితే తాజాగా ఈ కళలో తనకేంతో నైపుణ్యం ఉందని చాటుతున్నాడో మాయలమారి దొంగ.

ఇతడు చేసిన ఓ తెలివైన దొంగతనానికి సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.ఇప్పుడా వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఈ దొంగ ఏం చేశాడో తెలుసుకుందాం రండి.

వైరలైన వీడియోలో మనం ఒక పోలీస్ ఆఫీసర్, చేతి సంకెళ్ళతో ఉన్న ఓ దొంగని చూడొచ్చు.

ఆ పోలీస్ ఆఫీసర్ సదరు దొంగ చేతికి వేసిన బేడీలు తీసేసి దొంగతనం ఎలా చేశావో చూపించు అని ఆర్డర్ చేయడం గమనించవచ్చు.ఆ తర్వాత చాలా సన్నని కిటికీ ద్వారా సదరు దొంగ ఇంటి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది.

ఆ ఇంటి కిటికీ ఇనుప చువ్వలతో తయారు చేశారు.ఆ ఇనుప చువ్వ మధ్యలో నుంచి లోపలికి ఏ మనిషి కూడా ప్రవేశించలేడు.కానీ ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని సదరు దొంగ నిరూపించాడు.ఈ చోరుడు నిమిషం వ్యవధిలోనే తన బాడీ ని ఒక స్పాంజిలాగా అడ్జస్ట్ చేస్తూ ఇంట్లోకి కిటికీ ద్వారా ప్రవేశించాడు.

ఇలా ప్రవేశిస్తున్న సమయంలో చడీచప్పుడు కాకుండా అతడు తన నైపుణ్యం ఏంటో చూపించాడు.

ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.“వామ్మో ఈ దొంగ ఏంటి ఇలా ఉన్నాడు.ఇలాంటి కిటికీలు ఉంటే జాగ్రత్త పడకపోతే ఉన్నదంతా సమర్పించుకోవాల్సిందే” అని కామెంట్లు పెడుతున్నారు.

గణిత శాస్త్రం లోని ఐమూల ఫాలో అయ్యి సన్నని కిటికీ ద్వారా తెలివిగా నేర్పుతో ప్రవేశించిన సదరు దొంగని కొందరు ప్రశంసిస్తున్నారు కూడా.ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube