లండన్, ఆగ్నేయ ఇంగ్లాండ్ అంతటా ఆరోగ్యకరమైన జీవనం, సమాజ ఏకీకరణను ప్రోత్సహించడానికి ‘‘భారత్ క్రికెట్ కమ్యూనిటీ’’ని( Bharat Cricket Community ) స్థాపించిన భారత సంతతికి చెందిన హిమాన్షు జైన్‌ను( Himanshu Jain ) ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుతో( Points of Light Award ) ఆయను సత్కరించారు.
వైశాఖి, మహావీర్ జయంతి సందర్భంగా ఈ నెల ప్రారంభంలో ఈ అవార్డును ప్రకటించినట్లు 10 డౌనింగ్ స్ట్రీట్ (యూకే ప్రధాని అధికారిక కార్యాలయం) తెలిపింది.
తనకు ఈ అవార్డు దక్కినందుకు గాను హిమాన్షు జైన్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ గుర్తింపు భారత క్రిక్రెట్ కమ్యూనిటీ, తన తోటీ ట్రస్టీ ప్రశాంత్, స్థానికంగా.ప్రపంచవ్యాప్తంగా లెప్రసీ నివారణ, కమ్యూనిటీ ఇతర మానవతా కార్యక్రమాల సమిష్టి కృషికి నిదర్శనమన్నారు.
భారత్ క్రికెట్ కమ్యూనిటీ . భార్కింగ్ , సుట్టన్ , కెంట్ , సౌతండ్‌లకు చెందిన దక్షిణాసియా పురుషులకు క్రికెట్‌లో పాల్గొనే అవకాశాలను అందిస్తుంది.ప్రారంభ సెషన్‌ల నుంచి ప్రొఫెషనల్ లీగ్‌లలో ఆడే 200 మంది సభ్యుల వరకు ఈ కమ్యూనిటీ అండగా నిలుస్తుంది.

2021లో అధికారికంగా ప్రారంభించబడినప్పటి నుంచి ఇది వేలాది మంది పురుషులకు సహాయం చేసింది.కోచింగ్ సెషన్‌లు, టీమ్ ఫార్మేషన్‌లలో మహిళలు, పిల్లలను చేర్చేందుకు కూడా ఈ కమ్యూనిటీ విస్తరించింది.ఈ సంస్థ ప్రతి వీకెండ్‌లో ‘‘భారత్ ప్రీమియర్ లీగ్ ’’గా( Bharat Premier League ) పిలిచే చిన్న టోర్నమెంట్‌లను నిర్వహిస్తుంది.
అవార్డు వేడుకలు, ఫ్యామిలీ డేస్‌ల తద్వారా దక్షిణాసియా సంస్కృతిలో భాగమవ్వడానికి ఈ కమ్యూనిటీ ఓ వేదికగా మారింది.

ఈ నెల ప్రారంభంలో లండన్ మారథాన్ వంటి క్రీడలు, రోటరీ ఈవెంట్‌లలో పాల్గొనాల్సిందిగా తమ సభ్యులను సైతం ప్రోత్సహించింది.భారత్, యూకేలలో హిమాన్షు జైన్ నిర్వహిస్తున్న లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్‌కు భారత్ క్రికెట్ కమ్యూనిటీ సభ్యులు నిధులు సమకూరుస్తున్నారు.








