వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు ( Indians ) ఇప్పుడు ఆయా దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులుగా కీలక హోదాల్లో వున్నారు.ఇక పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతీయులు నిర్ణయాత్మక శక్తిగా వున్న సంగతి తెలిసిందే.మరోవైపు…కెనడా, బ్రిటన్, అమెరికా చట్టసభలలో తమ ఉనికిని చాటుకుంటున్న భారతీయులు ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఫెడరల్, సెనేట్ ఎన్నికల్లో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కాగా.2019లో ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు( Australia Parliament ) ఎన్నికైన తొలి భారత సంతతి శాసనసభ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న దేవ్ శర్మ.( Dave Sharma ) తాజాగా న్యూసౌత్ వేల్స్ లిబరల్ సెనేట్( New South Wales Liberal Senate ) రేసులో విజయం సాధించారు.47 ఏళ్ల శర్మ.సెనేట్ నుంచి పదవీ విరమణ చేసిన మాజీ విదేశాంగ మంత్రి మారిస్ పేన్( Marise Payne ) స్థానంలో ఎన్నికైనట్లు ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.2022 ఎన్నికల్లో ఓడిపోయే వరకు వెంట్‌వర్త్‌కు ప్రాతినిథ్యం వహించిన శర్మ.తాజా ఎన్నికల్లో న్యూసౌత్ వేల్స్ మాజీ మంత్రి ఆండ్రూ కాన్‌స్టాన్స్‌ను( Andrew Constance ) ఓడించారు.

ఈయనకు విపక్ష నేత పీటర్ డట్టన్ మద్ధతు వుంది.న్యూ సౌత్ వేల్స్ లిబరల్ పార్టీ సభ్యుల ఓటింగ్‌కు సంబంధించి ఆదివారం జరిగిన చివరి బ్యాలెట్‌లో శర్మ 251-206 ఓట్ల తేడాతో కాన్‌స్టాన్స్‌ను ఓడించినట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ నివేదించింది.2013 నుంచి 2017 వరకు ఇజ్రాయెల్‌లో( Israel ) ఆస్ట్రేలియా రాయబారిగా పనిచేసిన శర్మకు పార్టీలోని మితవాదులు మద్ధతు పలికారు.ఎన్నికల్లో విజయంపై శర్మ స్పందించారు.మాజీ సెనేటర్ పేన్ నుంచి బాధ్యతలు స్వీకరించడం ఒక ప్రత్యేకత అన్నారు.

అల్బనీస్ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు చర్యలపై సెనేట్‌లో పోరాడేందుకు అవకాశం కల్పించినందుకు పార్టీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.న్యూ సౌత్ వేల్స్ వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని దేవ్ శర్మ పేర్కొన్నారు.ప్రపంచంలో సంక్షోభం తీవ్రంగా వున్న సమయంలో మన దేశ జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం పోరాడేందుకు తనకు అవకాశం లభించిందన్నారు.మరోవైపు న్యూ సౌత్ వేల్స్ సెనేట్ స్థానాన్ని దక్కించుకున్నందుకు ఆయనను విపక్ష నేత డటన్ అభినందించారు.
కీలక సమయంలో శర్మ సెనేట్‌లో అడుగుపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.







