మంత్రి హరీశ్ రావు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.హరీశ్ రావు వ్యాఖ్యల వలనే ఈసీ రైతుబంధును ఆపేసిందని తెలిపారు.
మరో వారం రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే తాము అధికారంలోకి రాగానే రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.కావాలనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.
అయితే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల విడుదలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.







