సాధారణంగా మనదేశ యువతకు అమెరికా అంటే ఒక డ్రీమ్.అక్కడికి వెళ్లడానికి అవకాశం రావాలేగానీ… రెక్కలు కట్టుకుని వాలిపోవడానికి ఎంతో మంది ఎదురుచూస్తుంటారు.
అయితే కరోనా వైరస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు భారతదేశం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచం జేజేలు పలుకుతున్న సంగతి తెలిసిందే.దీనికి తోడు ఇంతటి కష్టంలోనూ వివిధ దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను సరఫరా చేసి తన మానవత్వం చూపించింది.
ఈ క్రమంలో పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చిన ఓ అమెరికన్ పౌరుడు.తాను తిరిగి స్వదేశానికి వెళ్లనని ఇండియాలోనే ఉంటానంటూ ఏకంగా న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించాడు.
జానీ పాల్ పీర్స్ అనే 74 ఏళ్ల వృద్ధుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చాడు.గత ఐదు నెలలుగా కేరళలోనే ఉంటున్నాడు.
ఇదే సమయంలో కరోనా వల్ల ఎక్కువగా నష్టపోయిన దేశం అమెరికాయే.ట్రంప్ మూర్ఖత్వం, దూరదృష్టి లేకపోవడం వల్ల అక్కడ మరణ మృదంగం మోగుతోంది.
రోజు వేలాది సంఖ్యలో కేసులతో పాటు అదే స్థాయిలో మరణాలు సైతం నమోదవుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లేందుకు జానీకి భయం వేసింది.అయితే భారతదేశం మాత్రం కోవిడ్ 19ను అద్భుతంగా నియంత్రించిందని పాల్ పీర్స్ ప్రశంసించారు.తనకు అమెరికా వెళ్లేందుకు ఇష్టం లేదని, తన పర్యాటక వీసాను బిజినెస్ వీసాగా మార్చాలని పెద్దాయన కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు.
వ్యాపార నమూనా చూపించి.ఐదేళ్ల బిజినెస్ వీసా పొందాలన్నది తన ఆకాంక్ష అన్నాడు.
ఇక్కడే కొన్నాళ్లు ఉండి ఓ పర్యాటక సంస్థను ప్రారంభించాలని తాను భావిస్తున్నానని జానీ పేర్కొన్నారు.

మరోవైపు అతని పర్యాటక వీసా గడువు 2025 వరకు ఉంది.అయితే, వీసా నిబంధనల ప్రకారం పర్యాటకం కోసం వచ్చిన విదేశీయులు 180 రోజులకు మించి మనదేశంలో ఉండకూడదు.ఇప్పటికే ఐదుసార్లు భారత్‌కు వచ్చి వెళ్లారు.
తనకు భారతదేశంలో ఎంతో సౌకర్యవంతంగా ఉందన్న ఆయన.రోజూ యోగా, ధ్యానంతో ప్రశాంతంగా గడుస్తోందన్నారు.మరి జానీ పిటిషన్‌పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.