తిరుమల శ్రీవారి ఆలయం( Tirumala )లో కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ( TTD ) శాస్ర్తోక్తంగా నిర్వహించింది.రానున్న 9వ తేది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి యేట నిర్వహించిన విధంగా నేడు కూడా ఆలయాన్ని సిబ్బంది శుద్ధి చేసారు…ముందుగామూలవిరాట్టు ఉన్న గర్భగుడి మొదలుకొని ఆలయం మొత్తాన్ని నీటితో అర్చకులు శుద్ధి చేసారు…అనంతరం పూజా సామగ్రి, ప్రసాదాలను తయారీచేసే పాత్రలను,వంటశాల, హుండి కానుకలు లెక్కించే పరకామణిని శుద్ధి చేసారు…
అనంతరం ఆలయ గోడలు, ప్రాకారాలకు పరిమళాలు వెదజల్లే సుగంధ ద్రవ్యాలను లేపనం చేసి, తరువాత నీటితో శుద్ధి చేసారు…అనంతరం మూలమూర్తికి చుట్టిన ధవళ వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజా కైంకర్యాలను అర్చకులు నిర్వహించినాంతరం సామాన్యభక్తులను టీటీడీ శ్రీవారి దర్శనానికి అనుమతించింది.
ఈ సందర్భంగా వారాపుసేవగా స్వామివారికి ఇవాళ జరగాల్సిన అష్టాదళపాదపద్మారాధన సేవను, విఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది