ప్రతి ఒక్కరు వారు చదువుకున్న రోజుల్లో వారు హై స్కూల్ చదువుకునే సమయంలో అందరూ కచ్చితంగా వారి గణితంలో జామెట్రీ బాక్స్ లను ఉపయోగించే ఉంటారు.ఇక ఆ జామెంట్రీ బాక్స్ లో పలు రకాలకు సంబంధించిన పరికరాలు మనకు కనబడతాయి.
నిజానికి జామెట్రీ బాక్స్ అయితే కొంటాము కానీ, అందులో ఉన్న వివిధ పరికరాలను మాత్రం అసలు ఉపయోగించం.ఇకపోతే అసలు ఆ జామెట్రీ బాక్స్ లో ఏమేమి ఉంటాయి అంటే… వృత్తలేఖిని, కోణమానిని, విభాగిని, త్రిభుజాకార స్కేల్, 15 సెంటీమీటర్ల స్కేల్, ఒక మెండర్, ఒక ఎరేజర్ ఇలా రక రకాల పరికరాలు మనకు అందులో ఉంటాయి.
ఇలా ఒక జామెట్రీ బాక్స్ లో ఎన్ని పరికరాలు ఉన్నా అందులో కొన్ని మాత్రమే ఉపయోగించి ఉంటారు.ఇంకా మరి కొన్ని పరికరాలు అయితే అసలు ఎందుకు ఇచ్చారు వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పటికి కూడా చాలామందికి తెలియదంటే నమ్మండి.
అవును నిజమే… జామెట్రీ బాక్స్ లో ఉండే త్రిభుజాకార స్కేల్, అలాగే విభాగిని ను ఇంత వరకు చాలా మంది ఉపయోగించే ఉండరు.ఇలా వాటి అవసరం లేకుండా వాటిని జామెట్రీ బాక్స్ లో ఎందుకు ఇస్తారో కూడా అసలు తెలియదు.
అయితే తాజాగా అందరి కి ఒక సందేహం లా ఉన్న ఈ విషయాన్ని ఒక మహిళ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.ఆమె పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరిని నిజంగా ఎందుకు ఉపయోగిస్తారో అన్న ఆలోచన మదిలో మెదిలేలా చేయడంతో… ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ గా మారింది.
ఇక ఆ పోస్ట్ కు సంబంధించి నెటిజెన్స్ కూడా చాలా మంది ఇప్పటికీ తాము కూడా వాటిని ఎందుకు ఉపయోగిస్తారో తెలియదని వాపోతున్నారు.
ఇకపోతే జామెంట్రీ బాక్స్ కొన్న కొత్తలో మాత్రం ఆ బాక్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని, ఆ తర్వాత అందులోని వస్తువులను ఎక్కడెక్కడో పడేసి వాటిని పట్టించుకోవడం మానేస్తారు.
ఈ విషయాన్ని చాలా మంది నెటిజెన్స్ కూడా తాము బాక్స్ కొన్నాను కాని, వాటిని ఎందుకు ఉపయోగించానో.ఎలా ఉపయోగించానో గుర్తు లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ జామెట్రీ బాక్స్ ను చూసిన తర్వాత మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.ఇంత జరిగినా చివరికి ఆ జామెట్రీ బాక్స్ లో ఉండే త్రిభుజాకార స్కేల్ అలాగే విభాగిని మాత్రం ఎందుకు ఎక్కడ ఉపయోగిస్తారో అన్న వాటికీ క్లారిటీ రాకపోవడం నిజంగా విడ్డురమే.
నిజానికి త్రిభుజాకార స్కేల్ అనేది కొన్ని డ్రాయింగ్స్ పరంగా ఇంజనీర్స్ ఉపయోగిస్తారు.