Gopichand Nijam Movie: ఇప్పటికీ ఆ హీరోయిన్, ఆ సీన్ చూస్తే తలెత్తుకోలేకపోతున్న.. గోపీచంద్ ఆ సినిమానే కారణమా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు కుమారుడిగా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు నటుడు గోపీచంద్(Gopichand).మొదటి హీరోగా ఈయన సినిమా నటించగా ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అనంతరం విలన్ పాత్రలలో నటించారు.

 Hero Gopichand About Nijam Movie Details Here-TeluguStop.com

ఈ క్రమంలోనే తన ప్రాణ స్నేహితుడు అయినటువంటి ప్రభాస్ హీరోగా నటించినటువంటి వర్షం( Varsham ) సినిమాలో ప్రభాస్ కు విలన్ పాత్రలో గోపీచంద్ నటించారు.ఇలా గోపీచంద్ విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరి కూడా విలన్ పాత్రలలోనే అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే మహేష్ బాబు హీరోగా నటించిన నిజం ( Nijam ) సినిమాలో కూడా విలన్ గా నటించారు.ఈ సినిమా తర్వాత గోపీచంద్ తిరిగి హీరోగా సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం పలు సినిమాలలో హీరోగా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇకపోతే ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఒక సినిమా గురించి ఒక హీరోయిన్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఆ హీరోయిన్ తో తాను చేసిన రొమాంటిక్ సన్నివేశాలే తన కెరియర్ పై కోలుకోలేని దెబ్బ కొట్టాయి అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Gopichand, Gopichand Nijam, Gopichandraashi, Mahesh Babu, Nijam, Prabhas,

మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో రాశి (Raashi) కూడా నెగిటివ్ పాత్రలో నటించారు.అయితే ఒక సన్నివేశంలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలను డైరెక్టర్ హై లెవెల్ లో పెట్టారు అయితే ఈ సన్నివేశాలలో నటించడం వల్ల తన కెరియర్ పై పూర్తిగా దెబ్బ పడిందని గోపీచంద్ వెల్లడించారు.ఇప్పటికీ ఆ హీరోయిన్ చూసిన , నిజం సినిమాలో ఆ సన్నివేశం చూసిన నేను తలెత్తుకోలేకపోతున్నాను అంటూ గోపీచంద్ ఈ సినిమాలో నటించడం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Gopichand, Gopichand Nijam, Gopichandraashi, Mahesh Babu, Nijam, Prabhas,

ఇలా ఈ సినిమా తర్వాత గోపీచంద్ పూర్తిగా విలన్ పాత్రలలో( Villain Roles ) నటించడానికి ఇష్టపడటం లేదు హీరో గానే వరుస సినిమాలలో నటిస్తూ వచ్చారు.కానీ తన ప్రాణ స్నేహితుడు అయినటువంటి ప్రభాస్ సినిమాలో( Prabhas ) మరోసారి ఆయనకు విలన్ గా నటించే అవకాశం వస్తే మాత్రం తాను వెనకడుగు వేయనని తప్పకుండా విలన్ పాత్రలలో నటిస్తాను అంటూ గోపిచంద్ చెప్పడం విశేషం.ఇక కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయనకు సరైన హిట్ మాత్రం పడలేదని చెప్పాలి.

Telugu Gopichand, Gopichand Nijam, Gopichandraashi, Mahesh Babu, Nijam, Prabhas,

ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ ఎదుర్కొన్నటువంటి డైరెక్టర్ శీను వైట్లకు( Director Srinu Vaitla ) గోపీచంద్ అవకాశం ఇచ్చారు.ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా ద్వార గోపీచంద్ అటు శీను వైట్ల ఇద్దరు కూడా సక్సెస్ కొట్టాలన్న కసితో ఈ సినిమాలో నటిస్తున్నారు.

మరి ఈ సినిమా వీరికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube