ఏపీ సీఎం జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ముందుగా పీఎం పాలెంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.అపోలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు.
తరువాత బీచ్ రోడ్డులో సీ హారియర్ యుద్ధ విమాన మ్యూజియంతో పాటు రామ్ నగర్ లో వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలో ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను జగన్ ప్రారంభించనున్నారు.అనంతరం ఎండాడలో కాపు భవనంతో పాటు భీమిలిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.