పక్కింట్లో ఉంటున్న వ్యక్తిని కాల్చి చంపిన కేసులో డల్లాస్ మాజీ పోలీస్ అధికారి అంబర్ గైగర్‌కు న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్షను విధించింది.విచారణ సందర్భంగా గైగర్‌కు 28 ఏళ్ల కారాగారవాసాన్ని విధించాలని ప్రాసిక్యూటర్లు వాదించారు.
ఇది నల్లజాతిపై వివక్షకు సంబంధించిన వ్యవహారం కావడంతో కఠినంగా వ్యవహరించాలని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
అంతకుముందు మృతుడి సోదరుడు బ్రాండ్ట్… నేరస్థురాలైన అంబర్ గైగర్‌ను కౌగిలించుకున్నాడు.
తన అన్నయ్య ఆమెను క్షమించాడని.ప్రస్తుతం గైగర్ క్రీస్తు సేవలో ఉంటుందని తెలిపాడు.
మీరు జైలుకు వెళ్లాలని తాను కోరుకోవడం లేదని.బోథమ్ ఏది కోరుకున్నాడో అదే తనకు కావాలని బ్రాండ్ట్ వెల్లడించాడు.
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే న్యాయస్థానం బయట నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు.న్యాయస్థానం తమకు సరైన న్యాయం చేయలేదని దీనిని తాము అస్సలు ఊహించలేదన్నారు.

డల్లాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అంబర్ గైగర్ 2018 సెప్టెంబర్ 6న విధులు ముగించుకుని తన ఫ్లాట్‌కు వచ్చారు.అయితే ఆమె ఫ్లాట్ 3వ అంతస్థులో ఉంటే.నాలుగో అంతస్థులోని ఓ ఫ్లాట్‌లోకి వెళ్లింది.అయితే అప్పటికే అందులో ఉన్న బోథమ్ జీన్‌ను ఆగంతకుడిగా భ్రమపడిన ఆమె అతనిపై దాడికి దిగడంతో పాటు రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో బోథమ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది.