తెలుగు ప్రేక్షకులకు సీనియర్ హీరో కార్తీక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ తరం ప్రేక్షకులకు కార్తీక్ గురించి అంతగా తెలియకపోయినా ఆ తరం ప్రేక్షకులు హీరో కార్తీక్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
హీరో కార్తీక్ కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో సీతాకోక చిలుక సినిమాతో తెలుగులో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.ఆ తర్వాత అనుబంధం, అన్వేషణ, పుణ్యస్త్రీ, అభినందన, గోపాల్ రావు గారి అబ్బాయి, మగ రాయుడుతోపాటు కల్యాణ్ రామ్ ఓమ్ 3డి సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు కార్తీక్.
ఆ తరువాత సినిమా లకు కాస్త గ్యాప్ తీసుకున్నా కార్తీక్ ఇటీవలే ఫ్రీ ఎంట్రీ ఇచ్చాడు.ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కార్తీక్ ప్రస్తుతం సినిమాలలో విలన్‌గా రాణిస్తున్నాడు.
అందరి హీరోల మాదిరిగానే కార్తీక్ కూడా తన కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట.కాగా హీరో కార్తీక్ తెలుగు తమిళ భాషల్లో కలిపి దాదాపుగా 125 కు పైగా సినిమాలలో నటించాడు.
ఇక 1988 లో సహనటి అయిన రాగిణి నీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో కూడా నటించారు.కాగా ఈ దంపతులకు గౌతమ్ కార్తీక్,గైన్ కార్తీక్ కుమారులు కూడా ఉన్నారు.
ఇకపోతే హీరో కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ కడలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.రాగిణి నీ పెళ్లి చేసుకున్న తర్వాత కార్తీక్ మళ్లీ నాలుగేళ్లకు రాగిణి సోదరి రతిని 1992లో పెళ్లి చేసుకున్నాడు.ఆ దంపతులకు తిరన్ కార్తీక్ కొడుకు కూడా ఉన్నాడు.
హీరోగా అప్పటివరకు అప్పటివరకు ఒక వెలుగు వెలిగిన కార్తీక్ 2000 సంవత్సరం నుంచి ఎన్నో ఉడుదుడుకులను ఎదుర్కొన్నాడట.ఆ తర్వాత 2005లో నటుడు సత్యరాజ్ శివలింగం ఐపీఎస్ సినిమాలో మొదటిసారిగా వేణు పాత్రలో నటించాడు హీరో కార్తీక్.
అయితే తనకున్న చెడు కారణాల వల్లే తన కెరియర్ నాశనం అయ్యింది అని కార్తీక్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.