వామ్మో, ఏంటీ విడ్డూరం.. రాయితో కొట్టినా పగలని ఉట్టి.. వీడియో వైరల్!

ఆగస్టు 19వ తేదీన భారత దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.తల్లులు తమ చిన్నారుల‌ను చిన్ని కృష్టుడిగా తయారుచేసి ఆనందంతో మురిసిపోయారు.

 Funny Matki Video Krishnashtami Goes Viral In Social Media,matki Video,social Me-TeluguStop.com

యువకులు ఎంతో ఉత్సాహంగా ఉట్టికొట్టే వేడుకలలో పాల్గొన్నారు.ఈ వేడుకలు దేశమంతటా కనుల విందు చేశాయి.

అయితే మ‌హారాష్ట్ర‌లో ఉట్టి కొట్టే వేడుకలో ఒక వింత చోటుచేసుకుంది.ఈ వేడుకలో ఉట్టిని రాయితో ఎంత బలంగా మోదినా అది పగలలేదు.

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

స్థానికంగా ద‌హి హండి అని పిలిచే ఈ వేడుకలో ఓ యువ‌కుడు ఉట్టిని చేరుకొని రాయితో కొట్టినా అది పగలలేదు.

దీంతో మరొక యువకుడు ఈ కుండని చేతితో పట్టుకొని మరీ 23 సార్లు ఒక పెద్ద రాయితో గ‌ట్టిగా కొట్టాడు.అయినా కూడా ఆ మ‌ట్టి పాత్ర‌ కొంచెం కూడా పగలు లేదు.

అసలు దానిపై పగుళ్లు కూడా కనిపించలేదు.దాంతో ఖంగుతిన్న ఆ యువకుడు తన ప్రయత్నాన్ని మానుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేయగా ఇది చూసి నెటిజన్లు కూడా షాక్‌ అవుతున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఈ ఉట్టిని మట్టితో తయారు చేశారా? లేక ఏదైనా స్టీల్ తో తయారు చేశారా? కుమ్మరి వ్యక్తి ఏదో పెద్ద ప్లానే వేసినట్లు ఉన్నాడు.అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

బహుశా దీనిని అంబుజా సిమెంట్ తో తయారు చేశారో ఏమో అందుకే అంత గట్టిగా ఉంది అని మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube