ఒక్కోసారి మంచి చేసినా చివరికి చెడే జరుగుతుంటుంది.అరటి పండు తిన్నా పన్ను విరిగింది అని పెద్దలు అన్నట్లు కొందరికి దురదృష్టం అనుకోకుండా కలుగుతుంది.
తాజాగా ఇలాంటి షాకింగ్ అనుభవం అన్నీకా ఓల్సన్ అనే ఫ్లోరిడా( Florida ) మహిళకు ఎదురయ్యింది.ఫ్లోరిడాలో రోడ్డు పక్కన పూల వ్యాపారికి డబ్బు ఇచ్చినందుకు ఈ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిషేధిత ప్రాంతంలో పూలు విక్రయిస్తున్న పూల వ్యాపారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అన్నీకా ఓల్సన్ ( Annika Olson )అడ్డుగా వచ్చినందని, అందుకే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.డబ్బులు ఇచ్చే సమయంలో పోలీసులు పూల వ్యాపారిని అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారనే విషయం తనకు తెలియదని అన్నీకా స్థానిక మీడియాకి చెబుతూ వాపోయింది.
అన్నీకా ఓల్సన్ రోడ్డుపై కారులో వెళుతుండగా పూల వ్యాపారిని చూసింది.దగ్గరగా కారు ఆపి అతనికి 20 డాలర్ల డబ్బు ఇచ్చింది.
కొద్దిసేపటి తర్వాత ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పూల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.తమ విచారణలో జోక్యం చేసుకుందని పోలీసులు చెబుతూ ఆ మహిళను కూడా అరెస్టు చేశారు.

నికరాగ్వా దేశస్థుడైన పూల వ్యాపారి రోడ్డు మధ్యలో పూలు విక్రయిస్తున్నాడని, ఇది ట్రాఫిక్ రూల్స్( Traffic Rules ) ఉల్లంఘించినట్లు అవుతుందని పోలీసులు తెలిపారు.పూల వ్యాపారికి డబ్బులు ఇవ్వాలంటూ అన్నీకా వాహనాలను మరింత అడ్డగించిందని వారు తెలిపారు.పూల వ్యాపారికి డబ్బు ఇస్తున్న సమయంలోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని తనకు తెలియదని ఆ మహిళ చెప్పింది.తాను దయతో అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె వివరించింది.
బెయిల్ రావడంతో అన్నీకా జైలు నుంచి విడుదలైంది.సెప్టెంబర్ 6న ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

ఈ ఘటనపై దుమారం రేగడంతో పాటు అపనమ్మకం నెలకొంది.ఇలాంటి అమాయకపు చర్యకు పాల్పడిన మహిళను ఎందుకు అరెస్టు చేశారని చాలా మంది ప్రశ్నించారు.పోలీసులు అతి చేస్తున్నారని కొందరు మండిపడ్డారు.కేవలం చట్టాన్ని అమలు చేస్తున్నామని పోలీసులు తమ చర్యలను సమర్థించుకున్నారు.తమ విచారణలో మహిళ జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ను అడ్డుకుంటున్నదని కూడా వారు చెప్పారు.కేసు ఇంకా విచారణలో ఉంది.
మరి ఆ మహిళ ఏదైనా అభియోగాలకు పాల్పడుతుందో లేదో చూడాలి.