భారతీయుల ప్రతిభకి ఎంతటి ఆదరణ ఉంటుందో, వారు ఎంతటి ప్రతిభని , నైపుణ్యాలని కలిగి ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఎదో ఒక సందర్భంలో ఎదో ఒక కారణం చే ఎప్పటికప్పుడు నిరూపించబడుతుంది.
ముఖ్యంగా భారతీయులు అత్యధికంగా ఉన్న అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతూ ఉంటుంది.అక్కడ అనేక రంగాలలో భారతీయులు కొలువు తీరి ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ భారత సంతతి వ్యక్తికి అరుదైన గుర్తింపు లభించింది.అది కూడా అలాంటిలాంటి గుర్తింపు కాదు భారీ గుర్తింపు లభించింది.అమెరికాలో 140 కోట్ల భారీ ప్రాజెక్ట్ ని భారత సంతతి వ్యక్తికి అప్పగించారు.
ఆలోచనల ఆధారంగా రోబోలని నియంత్రించ గలిగే సాంకేతికని అభివృద్ధి చేసుకోవడానికి తలచిన ఓ ప్రాజెక్ట్ ని భారతీయ మూలాలు ఉన్న గౌరవ్ శర్మ కి అప్పగించారు.
గౌరవ్ శర్మ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి ఈ నిధులు కేటాయించారు.మానవరహిత వాహనా (యూఏవీ)లు, బాంబులను పేలకుండా కేవలం ఆలోచనలతో నియంత్రించే వ్యవస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఈ భారీ ప్రాజెక్ట్ భాద్యతలు అమెరికా తనకి అప్పగించడంపై శర్మ సంతోషం వ్యక్తం చేశారు.