Mukesh Ambani : అంబానీ ఇంట పెళ్లంటే అంతే…కేవలం సింగర్ కోసమే ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా?

మన భారతదేశంలో అపర కుభేరుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ( Mukesh Ambani ) ఇంట పెళ్లి వేడుకలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు జామ్ నగర్ లో గత మూడు రోజుల నుంచి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

 Rihanna Dance And Singing Performance At Ananth Ambani Wedding-TeluguStop.com

ఇక ఈ పెళ్లి వేడుకల కోసం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ పెళ్లి వేడుకలలో పాల్గొనబోతున్నారు.గత మూడు రోజుల నుంచి ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ క్రికెటర్లు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు.ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖ సింగర్ రిహన్నా ( Rihanna ) అద్భుతమైనటువంటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈమెతో కలిసి సెలబ్రిటీలు కూడా ఆడి పాడి సందడి చేస్తున్నారు.

ఇక ఈమె హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే అంబానీ పెళ్లి వేడుకలలో భాగంగా ఈమె స్టేజ్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ఇలా వేదికపై ఈమె పాటలకు సెలబ్రిటీలు సైతం ఊగిపోయి డాన్స్ చేస్తున్నారు అంబానీ కుటుంబ సభ్యులకు కూడా ఆమెతో కలిసి వేదికపై డాన్స్ చేస్తూ సందడి చేశారు.ఇలా హాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫేమస్ సింగర్ ను ఇక్కడికి పిలిపించడంతో ఈమెకు ఎంత మొత్తంలో అంబానీ ఫ్యామిలీ రెమ్యూనరేషన్ ( Remuneration ) ఇవ్వబోతున్నారు అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఈమె అనంత అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లి వేడుకలలో భాగంగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకుగాను సుమారు 75 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారని సమాచారం.ఇలా ఒక సింగర్ ఒక స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.అక్కడే అంబానీ మార్క్ కనపడుతుంది.అదే మన ఇండియాలో సింగర్స్ అయితే ఏడాది మొత్తం ఎంతో కష్టపడినా ఈ రేంజ్ లో సంపాదించలేరు కదా అంటూ నేటిజన్స్ ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube