2021 వ సంవత్సరానికి సంబంధించి మేన్స్ టెస్ట్ టీమ్ ను ఐసిసి ప్రకటించింది.ఈ జట్టులో మొత్తం ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ కు చోటు లభించింది.
ఓపెనర్‌గా రోహిత్ శర్మ, వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌లు స్థానం సంపాదించగా.ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లికి మాత్రం చోటు దక్కలేదు.
గతేడాది నిర్వహించిన ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిచింది.జట్టును ముందుండి నడిపిన కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్‌గా అవకాశం దక్కింది.
ఇక ఐసీసీ టెస్టు జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్న రోహిత్ గతేడాది క్యాలెండర్ ఇయర్‌లో 47.68 సగటుతో 906 పరుగులు సాధించగా.టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.గతేడాది మొత్తం 12 టెస్టుల్లో 748 పరుగులు చేసాడు.ఇక ఆల్ రౌండర్ అశ్విన్ 9 మ్యాచ్‌ల్లో 54 వికెట్లు తీసి.355 పరుగులు కూడా చేసాడు.2021లో టెస్టుల్లో భారత్ మొత్తం 13 టెస్టులు ఆడగా.అందులో ఎనిమిది గెలిచింది, రెండు ఓడిపోగా మూడు డ్రా అయ్యాయి.
ఐసీసీ టెస్టు జట్టులో చోటు సంపాదించిన వారిలో శ్రీలంక నుండి దిముత్ కరుణరత్నే, ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మిడిలార్డర్‌లో.పాకిస్తాన్ నుంచి పవాద్ ఆలమ్, షాహిన్ అఫ్రిది, హసన్ అలీలు చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ మేన్స్ టెస్టు టీమ్ 2021 ఈ విధంగా ఉంది.కేన్ విలియమ్సన్ (కెప్టెన్, న్యూజిలాండ్), రోహిత్ శర్మ (భారత్), దిముత్ కరుణరత్నే (శ్రీలంక), మార్నస్ లబుషేన్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్), ఫవాద్ ఆలం (పాకిస్తాన్), రిషబ్ పంత్ ( భారత్), రవిచంద్రన్ అశ్విన్ (భారత్), కైల్ జేమీసన్ (న్యూజిలాండ్), హసన్ అలీ (పాకిస్థాన్)షాహిన్ షా ఆఫ్రిది (పాకిస్థాన్).