ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియా వరల్డ్‌లోనే జీవిస్తున్నారు.మినట్ టు మినట్ అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు.కాగా, సోషల్ మీడియా అతి పెద్ద వర్చువల్ వరల్డ్.
ఇందులో ఎప్పుడు ఏ విషయం ట్రెండవుతుంది? వైరలవుతుంది? అనేది చెప్పడం కష్టమే.కానీ, ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ కంటెంట్‌కు మాత్రం ప్రాధాన్యముంటుందని చెప్పొచ్చు.
అలా ప్రతీ రోజు ఏదో ఒక ఫొటోనో వీడియోనో వైరలవుతుంటుంది.తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది.
అదేంటంటే.
కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.
ఇప్పుడు కూడా పలువురు ఇండ్లలోనే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.మరికొందరు థర్డ్ వేవ్ భయంతోనూ హోంలోనే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే తమ మెదడుకు పదును పెడుతున్నారు.పజిల్స్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.
అలాంటి వారి కోసమై ఓ ఫొటో నెట్టింట షేర్ కాగా, ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది.ఇంతకీ అందులో ఏముందంటే.
వరుణ్ థక్కర్ అనే ఫొటోగ్రాఫర్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలో జింకలు పరుగెడుతున్నాయి.

అందులో పులి ఎక్కడుందో? కనిపెట్టండి చూద్దాం అంటూ అతడు చాలెంజ్ విసిరాడు.అయితే, సదరు ఫొటోలో జింకల మంద పరుగెత్తడం మనం ఈజీగా గమనించొచ్చు.కానీ, టైగర్ ఎక్కడుంది? అనేది గుర్తు పట్టాలంటే క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే.ఈ ఫొటో పజిల్ క్రాక్ చేసేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరిచారు.కొందరు ఫొటోలో ఉన్న టైగర్‌ను గుర్తించి, పజిల్ క్రాక్ చేశారు.మరి కొందరు ఫెయిల్ అయ్యారు.అయితే, సడెన్ గా ఆ ఫొటోను చూస్తే అస్సలు టైగర్ లేదు అని అనిపించొచ్చు.
కానీ, సదరు చిత్తరువును డిటెయిల్డ్‌గా గమనిస్తే మీరూ ఫొటో టైగర్‌ను గుర్తించొచ్చు.