ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు.నిన్న కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అయితే ఈరోజు 24వ తారీఖు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఉదయం కడప జిల్లా నాయకులతో కలిసి సీఎం జగన్ తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు.
ఇదే సమయంలో పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇంకా పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ సీఎం జగన్ ఈరోజు ప్రారంభించనున్నారు.
రేపు క్రిస్మస్ పండుగ పర్వదినం నేపథ్యంలో ప్రతి ఏట కుటుంబంతో కలిసి పాల్గొన్నట్టుగానే పులివెందుల సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో సీఎం జగన్ పాల్గొని అక్కడే క్రిస్మస్ కేక్ కట్ చేయనున్నారు. పులివెందుల సీఎం జగన్ పర్యటన పనులు మొత్తం కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మున్సిపాల్ ఇంచార్జి వైఎస్ మనోహర్ రెడ్డి.
ఏర్పాట్లు చేసి దగ్గరుండి ఈ రోజు ఉదయం పనులు మొత్తం పరిశీలించారు.