పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కన్నడ నటి శ్రీ లీల. ఇలా ఈమె మొదటి సినిమానే తెలుగులో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక తన మొదటి సినిమా కొత్తవారితో నటించారు.ఇలా మొదటి సినిమా మొత్తం కొత్త వారితో చేసినటువంటి శ్రీలీలకు తన రెండవ సినిమా ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశం అందుకున్నారు.
ఇలా రవితేజ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఈమె మొదట్లో కాస్త కంగారుపడిన తరువాత పరిస్థితులు మొత్తం సెట్ అయ్యాయని ధమాకా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చెప్పుకొచ్చారు.
తనకు రెండవ సినిమానే ధమాకా వంటి సినిమాలో అవకాశం రావడంతో చాలా సంతోషం వేసిందని ఇలాంటి మంచి అవకాశాలు కల్పించినందుకు ప్రతిరోజు దేవుడికి థాంక్స్ చెప్పుకుంటానని ఈ సందర్భంగా శ్రీ లీల కామెంట్ చేశారు.
రవితేజ గారితో నటించడానికి మొదట్లో ఇబ్బంది పడినప్పటికీ తరువాత చాలా కంఫర్ట్ గా అనిపించిందని, సెట్ లో రవితేజ తనకు చాలా సపోర్ట్ చేశారని ఈ సందర్భంగా శ్రీ లీల రవితేజ గురించి చెప్పుకొచ్చారు.
ఇకపోతే ఈమె ధమాకా సినిమాలో నటించడానికి అంటే ముందుగానే రవితేజకు పెద్ద అభిమానిని తెలిపారు.ఆయన నటించిన కిక్ విక్రమార్కుడు సినిమాలు తనని బాగా ఆకట్టుకున్నాయని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో వివిధ వేరియేషన్స్ లలోనటించడం తనని బాగా ఆకట్టుకుందని ఈ సందర్భంగా శ్రీ లీల రవితేజ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ధమాకా సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.