న్యూస్ రౌండప్ టాప్ 20

1.జనసేన మాతో పొత్తు లో ఉంది


 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gol-TeluguStop.com
Telugu Chandrababu, Congress, Lokesh, Pavan Kalyan, Pawan Kalyan, Revanth Reddy,

జనసేన తమ పార్టీతో పొత్తులనే ఉందని బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి( Daagubati Purandeswari ) అన్నారు.

2.ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రపతి శుభాకాంక్షలు

భారత ప్రధాని నరేంద్ర మోది 73వ పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu ) శుభాకాంక్షలు తెలియజేశారు.

3.రేవంత్ రెడ్డి విమర్శలు

టిఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) పైన విమర్శలు చేశారు.కేసీఆర్, కిషన్ రెడ్డి వేరువేరు కాదని కెసిఆర్ అనుచరుడు కిషన్ రెడ్డి అని రేవంత్ విమర్శించారు.

4.పవన్ కళ్యాణ్ కామెంట్స్

మరో ఆరు నెలల్లో జనసేన టిడిపి అధికారంలోకి రాబోతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) అన్నారు.

5.జగన్ పై లోకేష్ విమర్శలు


Telugu Chandrababu, Congress, Lokesh, Pavan Kalyan, Pawan Kalyan, Revanth Reddy,

నిడదోలు సభలో ములాఖత్ మిలాఖత్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్న సీఎం జగన్ చంచల్ గూడ జైలు జీవితాన్ని మరిచిపోయినట్టు ఉన్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) విమర్శించారు.

6.‘ఇండియా కూటమి’ సభ వాయిదా

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా అక్టోబర్ నెలలో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ఇండియా కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది.

7.నందమూరి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Arrest ) వార్త విని కొందరు ప్రాణాలు కోల్పోయారని నందమూరి రామకృష్ణ అన్నారు.

8.స్కిల్ స్కాం అంతా ఉత్తిదే : సిమెన్స్ మాజీ ఎండీ

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం వ్యవహారంపై సిమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇందులో స్కాం ఏమి జరగలేదని,  స్కిల్ కేసు పై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైన అని ఆయన అన్నారు.

9.కెసిఆర్ పై బండి సంజయ్ విమర్శలు


Telugu Chandrababu, Congress, Lokesh, Pavan Kalyan, Pawan Kalyan, Revanth Reddy,

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శలు చేశారు.  ముఖ్యమంత్రిని కాసిం రజ్వీ తో పోల్చారు.

10.మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం

భారత ప్రధాని నరేంద్ర మోది( PM Modi ) ఢిల్లీలోని ద్వారక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ యశో భూమి మొదటి దశను ప్రారంభించేందుకు వెళుతూ మెట్రో రైడ్ చేశారు.

11.ప్రధాని మోదీకి రాహుల్ శుభాకాంక్షలు


Telugu Chandrababu, Congress, Lokesh, Pavan Kalyan, Pawan Kalyan, Revanth Reddy,

భారత ప్రధాని నరేంద్ర మోదికి పుట్టినరోజు( PM Narendra Modi Birthday ) సందర్భంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

12.అమరవీరుల స్థూపానికి అమిత్ షా నివాళులు

కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

13.నేడు అఖిలపక్ష భేటీ

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

14.‘ఇండియా ‘ భోపాల్ రద్దు

భోపాల్ లో ఇండియా కూటమి మొదటి ర్యాలీ జరుగుతుందని ఇటీవల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటించారు .అయితే ఈ ర్యాలీని రద్దు చేసుకున్నారు.

15.దేశవ్యాప్తంగా 23 నూతన సైనిక్ స్కూళ్లు

భాగస్వామ్య విధానంలో దేశంలో 23 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటుకు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆమోదం తెలిపారు.

16.బహుముఖ వ్యూహంతోనే హైదరాబాద్ అభివృద్ధి

హైదరాబాద్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS Government ) బహుముఖ వ్యూహంతో పనిచేస్తుందని తెలంగాణ మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

17.కెసిఆర్ పై షర్మిల విమర్శలు


Telugu Chandrababu, Congress, Lokesh, Pavan Kalyan, Pawan Kalyan, Revanth Reddy,

పూర్తికాని ప్రాజెక్టుతో కెసిఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( YSRTP Sharmila ) విమర్శించారు.

18.హరీష్ రావు కామెంట్స్

పాలమూరు ప్రజలు సీఎం కేసీఆర్ కి,  గ్రామదేవతలకు అభిషేకాలు చేస్తే కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్లు వస్తున్నాయి మంత్రి హరీష్ రావు విమర్శించారు.

19.నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాద్ నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

20.డిజిపి సమీక్ష

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రత ఏర్పాట్లపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube