ఎన్టీఆర్(Sr Ntr) తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఒకే ఒక్క సంకల్పం తో తెలుగు దేశం అనే పేరుతో పార్టీ పెట్టి కేవలం 9 నెలల టైములో ప్రచారం చేసుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కి కూర్చున్నారు.కానీ ఇది చెప్పినంత ఈజీ కాదు.
రాజకీయం అంటే బురదలో బోర్లాడమే అని కొంత మంది బావిస్తూ ఉంటారు.ఉన్న కాస్త పరువును రాజకీయాల్లో పోగొట్టుకోవడం ఎందుకు అని చాల మంది ఎన్టీఆర్( NTR ) పిలిచినా కూడా రాజకీయాల్లోకి రాలేదు.
సినిమా అంటే ఒక గ్లామర్ ఫీల్డ్ ఆ గ్లామర్ రాజకీయాలకు పనికి వస్తుందా అంటే కొంత మేర అవును అన్నా కూడా మరికొంత మేర కాదు అని చెప్పి తీరాల్సిందే.
ఇక ఎన్టీఆర్ తాను రాజకీయ పార్టీ పెట్టి చాల మంది సినీ సెలబ్రిటీలను తనతో పాటు రావాలని కోరారు.హీరోల దగ్గర నుంచి హీరోయిన్స్ వరకు అయన అడగని నటులు లేరు.అయితే కొంత మంది తెలుగు దేశం పార్టీ లో చేరి పదవులను దక్కించుకున్నారు.
మంత్రులుగా(ministers) చెలామణి అయ్యి ఆ తర్వాత మెల్లిగా రాజకీయాలను పక్కన పెట్టి మళ్లి సినిమాల్లో బిజీ అయ్యారు.మరి కొందరి విషయంలో ఆలా జరగలేదు.సినిమాల్లోకి రాలేము అంటూ ఎన్టీఆర్ మొహం మీద చెప్పిన వారు కూడా ఉన్నారు.ఉదాహరణకు అక్కినేని(Akkineni) వారిని తీసుకుంటే ఇద్దరం కలిసి పార్టీ పెడదాం బ్రదర్ నాతో చేతులు కలపండి అంటూ పలుమార్లు అడిగిన అయన నవ్వుతూనే దాటవేశారు.
పూలు వేయించుకున్న చోటనే రాళ్లతో కొట్టించుకోవాలి నన్ను వదిలేయండి బ్రదర్ అంటూ ఎన్టీఆర్ విజ్ఞప్తిని తోసిపుచ్చారు అక్కినేని.ఇక భానుమతి(Bhanumati) లాంటి ఫైర్ బ్రాండ్ గురించి అయితే చెప్పకేర్లేదు.ఏదైనా ఉంటె ఆమెకు మొహం పైన చెప్పడమే అలవాటు .మహిళగా మీకు మంచి ప్రాధాన్యత ఉంటుంది రాజ్యసభ కు కూడా పంపిస్తాం.అక్కడ మీ గొంతు వినిపించండి.మాకు వెన్నుదన్ను గా ఉండండి అంటూ ఎన్టీఆర్ భానుమతిని (ntr Bhanumati) అడిగితే, మమ్మల్ని తిట్టించాలని డిసైడ్ అయిపోయారు అంటూ భానుమతి మొహం మీదే చెప్పిందట.
కానీ శారద(Sarada) లాంటి వారు ఆ ఆహ్వానం మన్నించి పదవి అందుకున్నారు.