ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవల అరెస్ట్ అయిన అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఉపసంహరణ పిటిషన్పై స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది.అరుణ్ పిళ్లై వాంగ్మూలం ఉపసంహరణ పిటిషన్ తో పాటు ఈడీ సమాధానం అంశాలు పరిశీలనలో ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది.
ఈ మేరకు కేసు విచారణ సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.మద్యం కుంభకోణంలో మొదటగా వాంగ్మూలం ఇచ్చిన అరుణ్ పిళ్లై తరువాత తన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
కాగా ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.







