ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం అయ్యే శుభవేళ రాబోయే వేసవికి శుభ సూచకం.సృష్టి మొత్తం కూడా శిశిరంలో బోసిపోయి మళ్ళీ కొత్త చిగురు తొడగడానికి అనువైన కాలం వచ్నిందుకు పులకించిపోయే సమయంలో వచ్చే పండుగ ఈ మకర సంక్రాంతి.పురాణాల్లో సంక్రాంతి గురించి అనేక కథలు ఉన్నాయి.వాటిలో ఒక కథ తెలుసుకోండి.కల్పం ఆరంభంలో.భూలోకానికి ప్రళయం వచ్చి భూమి సముద్రంలో మునిగిపోయిన సమయంలో శ్రీ హరి ఆది వారాహ రూపం ఎత్తి భూమిని ఈ రోజునే ఉద్ధరించాడు.
హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని పాతాళానికి తీసుకు వెళ్తూ సముద్రంలో దూకుతున్న అతనిని శ్రీమన్నారాయణుడు వరాహ రూపం ఎత్తి సంహరించాడు.భూమిని ఉద్ధరించాడు.
అందుకనే వరాహ స్వామిని ప్రార్ధిస్తే కష్టాలు ఉండవు.అన్ని సంతోషాలు చేకూరతాయి.
వరాహ స్వామి భూమిని ఉద్ధరించి నందుకు సంకేతంగా గుమ్మడి పండు దానం చేస్తారు.దీనినే “కూష్మాండ దానం” అని అంటారు.
ఈ దానం చేయడం వల్ల సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు సమర్పించినట్లు అవుతుందన్నది విశ్వాసం.
మన ప్రాంతంలో తక్కువ గాని కేరళ ప్రాంతంలో బలి చక్రవర్తికి సంబంధించిన పండుగ గానే చేసుకుంటారు.
బలి చక్రవర్తికి ప్రదానమైన లక్షణం ఏంటంటే దానం చేయడం.దానం చేసే లక్షణం ఉండబట్టే.
కదా శుక్రాచార్యుడు వద్దమ్మా వామన మూర్తికి మూడు అడుగులు దానం చేశాడు.ఒక మనిషిని సంతృప్తి పరచడం అంటే వారికి ఇష్టమైన పని చేయడమే వారికి సంతృప్తిగా కనిపిస్తుంది.
కాబట్టి బలి చక్రవర్తికి, శ్రీ విష్ణువు వారిద్దరినీ సంతృప్తి పరచాలంటే గుమ్మడి పండును దానం చేయాలి.అంటే ఎంతో పవిత్ర పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ రోజున గుమ్మడి పండ్లను దానం చేస్తే.
భూదానం చేసినంత ఫలితం ఉంటుందట.