మచ్చలేని చర్మం మీసొంతం అవ్వాలంటే త‌ప్ప‌కుండా దీన్ని ట్రై చేయండి!

ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా ముఖ చ‌ర్మంపై ఏదో ఒక కార‌ణం చేత మ‌చ్చ‌లు ప‌డుతునే ఉంటాయి.

మొటిమ‌లు, హైపర్ పిగ్మెంటేషన్, హార్మోన్ ఛేంజ‌స్‌, మెలనిన్ ఉత్పత్తి అధికంగా ఉండ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చ‌ర్మంపై చిన్న చిన్న మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి.

ఈ మ‌చ్చ‌లు ముఖ సౌంద‌ర్యాన్ని దెబ్బ తీయ‌డంతో పాటు తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తాయి.ఈ క్ర‌మంలోనే ముఖంపై ఏర్ప‌డిన మ‌చ్చ‌ల‌ను వ‌దిలిచుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.

ఆ లిస్ట్‌లో మీరు ఉంటే అస్స‌లు టెన్ష‌న్ ప‌డొద్దు.ఎందుకుంటే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఫువ‌ర్ రెమెడీని ట్రై చేస్తే చాలా సుల‌భంగా మచ్చలేని చర్మాన్ని త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ./br>ముందుగా ఒక నిమ్మ పండు, ఒక ట‌మాటో తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి.

Advertisement

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.అందులో గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో క‌డిగి పెట్టుకున్న నిమ్మ పండు, ట‌మాటో వేసుకుని మూత పెట్టి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించి.చ‌ల్లార‌బెట్టుకోవాలి./br>

ఇలా ఉడికించి చ‌ల్లార‌బెట్టుకున్న నిమ్మ పండు, ట‌మాటోల‌ను వాట‌ర్‌తో స‌హా మిక్సీ జార్‌లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మం నుంచి స్ట్రైన‌ర్ సాయంతో స్మూత్ పేస్ట్‌ను స‌ప‌రేట్ చేసుకుని ఒక బౌల్‌లోకి వేసుకోవాలి.ఈ ట‌మాటో-లెమ‌న్ పేస్ట్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడ‌ర్‌, చిటికెడు క‌స్తూరి ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ఇర‌వై నిమిషాల అనంత‌రం వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక‌సారి గ‌నుక చేస్తే చ‌ర్మంపై ఎలాంటి మ‌చ్చ‌లు ఉన్నా క్ర‌మంగా త‌గ్గిపోయి ముఖం గ్లోయింగ్‌గా మారుతుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు