కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు విజయ్ దళపతి.
ఈయన సినిమా వస్తుంది అంటే ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈయన సినిమాలు కూడా కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తాయి.
ఇటీవలే బీస్ట్ సినిమాతో వచ్చాడు విజయ్.ఈ సినిమా ప్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్య పరిచింది.ఇక ఇప్పుడు విజయ్ నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో రష్మిక నటిస్తుందని ఇప్పటికే ప్రకటించారు.
వంశీ మొదటిసారి ఒక బై లాంగువల్ సినిమానుభారీ తారాగణంతో చేస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
భారీ స్థాయిలో భారీ తారాగణంతో నిర్మాణం జరుగుతున్న ఈ సినిమా గురించి పట్టించుకోకుండా విజయ్ నెక్స్ట్ సినిమా గురించి చర్చించు కోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

విజయ్ దళపతి తన 67వ సినిమాను లోకేష్ కనకరాజ్ తో చేయనున్నాడు.ఇటీవలే లోకేష్ కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.దీంతో విజయ్ 66వ సినిమా వదిలేసి.
ఇప్పుడు 67వ సినిమా గురించి చర్చ జరుపుతున్నారు.అయితే దీనిపై కొంత మంది మాత్రం పెదవి విరుస్తున్నారు.
దళపతి 67 కంటే ముందు 66వ సినిమా ఉందని.ముందు దీని గురించి మాట్లాడుకోండి అంటూ సెటైర్స్ వేస్తున్నారు.