Shah Rukh Khan : ఆ విషయంలో షారుఖ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా.. ఇప్పుడు అదే హాట్ టాపిక్?

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.షారుఖ్ ఇటీవల పఠాన్ సినిమా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Bollywood Hero Shahrukh Khan Upcoming Movies Latest Updates-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అంతేకాకుండా ఇండియాలో ఇప్పటివరకు 1000 కోట్ల మార్కును దాటిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది.

అంతేకాకుండా చాలాకాలం తర్వాత షారుఖ్ ఖాన్ ఈ సినిమాతో సక్సెస్ను అందుకోవడంతోపాటు బాలీవుడ్ కీ కూడా పండుగ వాతావరణం తీసుకువచ్చారు.

Telugu Bollywood, Pathaan, Shah Rukh Khan-Movie

యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన స్ప్రై త్రిల్లర్ సినిమా పఠాన్( Pathaan )భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా భారీ స్థాయిలో కలక్షన్స్ ని రాబట్టిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి 50 రోజులు అవుతున్నా కూడా ఇంకా సక్సెస్ఫుల్గానే రన్ అవుతోంది.కాగా హీరో షారుక్ ఖాన్ కి దాదాపుగా 4 ఏళ్ళ తర్వాత హిట్ దక్కిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా అభిమానులతో తనకున్న అనుబంధాన్ని స్పెషల్ గా పంచుకున్నారు షారుఖ్ ఖాన్.ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.ఈ సందర్భంగా పఠాన్ సినిమా సక్సెస్ ని అలాగే కొనసాగిస్తానని మాట కూడా ఇచ్చారు.

Telugu Bollywood, Pathaan, Shah Rukh Khan-Movie

ఇకపోతే ప్రస్తుతం షారుక్ ఖాన్ నటిస్తున్న తదుపరి సినిమా జవాన్( Jawan ) ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు.ఇక ఇందులో షారుక్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్గా నటించనుండగా ప్రియమణి కీలకపాత్రలో నటించనుంది.

జవాన్ సినిమాను జూన్లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే.కానీ ఈ సినిమా షెడ్యూల్స్ కారణంగా ఆలస్యం అవుతుండడంతో అనుకున్న సమయానికి విడుదల చేయడం కష్టమే అని అంటున్నారు.

దీపావళి సీజన్ లో జవాన్ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.అయితే జవాన్ సినిమా కనుక పోస్ట్ ఫోన్ అయితే ఆ ఎఫెక్ట్ డంకీ సినిమా పై పడుతుంది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పటాన్ సినిమా తర్వాత ఆ విజయాన్ని అలాగే కొనసాగిస్తాను అంటూ షారుఖ్ ఖాన్ ఇచ్చిన మాట గురించే చర్చలు నడుస్తున్నాయి.షారుఖ్ ఖాన్ ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ షారుక్ ఖాన్ మాట మీద నిలబెడతారా లేదా అన్నది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube