భక్త ప్రహ్లాద సినిమాలో రోజా రమణి యాక్టింగ్ చూస్తే మన కళ్లని మనమే నమ్మలేము.చిన్న వయసులో అంత గొప్పగా ఆమె ఎలా కనబరిచిందో అని ఆశ్చర్యపోకుండా ఉండలేము.
మాస్టార్ మహీంద్రా, బాలాదిత్య, మాస్టర్ భరత్ ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు తమ వయసుకు మించి అద్భుతమైన నట కనపరిచి ఆకట్టుకున్నారు.వీరిలో కొందరు పెద్దయ్యాక హీరోలు, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు.
కొందరు మాత్రం ఒకట్రెండు సినిమాలో టెరిఫిక్ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచి ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌కి దూరమయ్యారు వాళ్లకు అవకాశాలు రాక కాదు, కానీ పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టడం కోసం వాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది పీఎస్ కీర్తన.( PS Keerthana )
2002లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమృత’ సినిమాలో( Amrutha Movie ) కీర్తన నటించింది.ఈ చిత్రంలో మాధవన్, సిమ్రాన్ హీరోహీరోయిన్లుగా నటించారు కానీ వారిద్దరి కంటే కీర్తన క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా స్టోరీ మొత్తం ఆ కీర్తన గురించే ఉంటుంది.ఆమె విడిపోయిన తన పేరెంట్స్ ను కలవాలని చాలా తపన పడుతుంది.ఇందులో కీర్తనను ఇండియన్ పేరెంట్స్ దత్తత తీసుకుంటారు.కానీ తన బయోలాజికల్ పేరెంట్స్ ని తిరిగి కలవడానికి ఆమె ఎంతో తపన పడుతుంది.
ఆరాటంతో పోరాటాలు చేస్తుంటుంది.
అలాంటి ఎమోషనల్ సన్నివేశాలన్నిటిలో కూడా కీర్తన అద్భుతంగా నటించింది.కొన్ని సన్నివేశాల్లో అల్లరి చేస్తూ నవ్విస్తే, మరికొన్ని సన్నివేశాల్లో బాగా ఏడిపించేసింది.ఇంత చిన్న వయసులో ప్రేక్షకులను నవ్వించడం, ఏడిపించే లాగా యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు.
ఒక్కసారైనా ఈ సినిమా చూస్తే ఆమె ఎంత గొప్ప నటీమణో అర్థమవుతుంది.కీర్తన ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆశతో సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టింది కానీ ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినట్లయితే సావిత్రి, సౌందర్య లాగా గొప్ప నటి అయ్యుండేది.
అమృత మూవీకి ఎన్నో అవార్డ్స్ రాగా వాటిల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్స్( Best Child Artist Award ) ఎక్కువగా ఉన్నాయి.అవన్నీ కీర్తనకే దక్కాయి.ప్రముఖ తమిళ యాక్టర్స్ అయిన పార్తీబన్,( Parthiban ) సీతలకు( Seetha ) కీర్తన జన్మించింది.బాగా చదువుకున్న తర్వాత ఆమె ప్రముఖ ఎడిటర్ అయిన అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఇంటికి కోడలిగా వెళ్ళింది.
ఆమె నటుడు అక్షయ్ అక్కినేని పెళ్లి చేసుకుంది.అయితే ఈ అక్కినేని వారికి మన తెలుగు అక్కినేని కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు.
కానీ తమిళంలో మాత్రం వీరు బాగా పేరు తెచ్చుకున్నారు.శ్రీకర్ ప్రసాద్, ఎల్వీ ప్రసాద్ ఇద్దరూ బ్రదర్స్ అవుతారు.
ఇలా ఉన్నతమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి కీర్తన కోడలుగా వెళ్ళింది.