రెండు రోజుల్లో ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి : అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా : పెండింగ్ లో ఉన్న ధరణిలో దరఖాస్తులను రెండు రోజుల్లో పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

 Dharani Applications To Be Resolved In Two Days Additional Collector N Khimya Na-TeluguStop.com

మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు, అన్ని మండలాల తహశీల్దార్లతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

వచ్చే రెండు రోజుల్లోగా దరఖాస్తులను పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ ఆర్డీఓ లు, తహశీల్దార్లను ఆదేశించారు.

మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై ఆరా తీశారు.జిల్లాలో పెండింగ్ లో ఉన్న 763 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు.తహశీల్దార్ల లాగిన్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే ఆర్డీఓ లకు పంపించాలని సూచించారు.సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు రమేష్, రాజేశ్వర్, మండలాల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube