ఇటీవల కాలంలో ఒక సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఎన్నో సినిమాలు మొదటి భాగం పూర్తి అయ్యి సీక్వెల్ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.
ఇలా ఇటీవల వచ్చిన కల్కి సినిమా సైతం త్వరలోనే కల్కి 2 ( Kalki 2 )షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సీక్వెల్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక కల్కి సీక్వెల్స్ సినిమా గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఊహించుకుంటూ ఉంటున్న తరుణంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్( Director Nag Ashwin ) ప్రేక్షకుల ఊహలకు అడ్డుకట్టు వేస్తూ నిజానిజాలను వెల్లడిస్తున్నారు.
నిజానికి కల్కి సినిమా చూసిన తర్వాత సుప్రీం యాస్కిన్ ( Supreme Askin )ను కల్కి చంపుతారని అందరూ భావించారు.
కానీ ఈ వార్తలపై డైరెక్టర్ స్పందిస్తూ హీరో భైరవనే సుప్రీం యాస్కిన్ ను చంపేస్తారని క్లారిటీ ఇచ్చారు అంతేకాకుండా సీజన్ వన్ లో ప్రభాస్ బుజ్జి కారు చాలా ఫేమస్ అయ్యింది.క్లైమాక్స్ లో ప్రభాస్ బుజ్జి కారుతో పాటు ఆకాశంలోకి వెళ్తారు.
ఆయన ఎక్కడకు వెళ్తారు ఏంటి అనే విషయాలపై ఎన్నో సందేహాలు ఏర్పడ్డాయి.
ప్రభాస్ ఈసారి కల్కిగా మారి రెక్కల గుర్రంపై ఎగురుతూ వెళ్తారంటూ ఎన్నో ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి కానీ అశ్విన్ మాత్రం బుజ్జి లాగే ఉంటుందని ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు.ఇక విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) పాత్ర పై కూడా ఈయన క్లారిటీ ఇస్తూ ప్రేక్షకుల అంచనాలు మించకుండా ఈయన ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చారు.
ఈ విధంగా ప్రభాస్ కల్కి సినిమా విషయంలో ఉన్న సందేహాలు అన్నింటికి నాగ్ అశ్విన్ చెక్ పెట్టడమే కాకుండా, ఈ సీక్వెల్ సినిమా విషయంలో ఆయన ఫుల్ క్లారిటీతో ఉన్నారని స్పష్టం అవుతుంది.ఇక ఈ సినిమా కథలో ఎలాంటి మార్పులు ఉండవని డైరెక్టర్ చెప్పకనే చెప్పేశారు.అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా తాను అనుకున్న ధోరణిలోనే ఈ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.