వైరల్ వీడియో: 8 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన డేగ.. చివరికి?

అడవి జంతువులే కాదు పక్షులు కూడా చాలా ప్రమాదకరమైనవి.అవి కొన్నిసార్లు మనుషులపై కూడా అటాక్ చేస్తుంటాయి.

 Viral Video: The Eagle That Tried To Pick Up The 8-year-old Girl... In The End,-TeluguStop.com

ఇక డేగలు( Bald eagles ) చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లాలని చూస్తాయి.ఇలాంటి షాకింగ్ సంఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి.తాజాగా ఇలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో ప్రత్యక్షమైంది.“పేజ్‌పోస్టింగ్‌యానిమల్‌అటాక్స్” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ భయంకరమైన వీడియో షేర్ చేసింది.వైరల్‌గా మారిన ఆ వీడియోలో 8 ఏళ్ల చిన్నారిని ఒక భారీ గోల్డెన్ ఈగిల్ ఎత్తుకెళ్లాలని ట్రై చేయడం చూడవచ్చు.ఆ పక్షి అకస్మాత్తుగా ఆ చిన్నారిపైకి దూకి, ఆమెను తన గోళ్లతో పట్టుకోవడానికి ప్రయత్నించింది.

ఈ భయంకరమైన క్షణాన్ని ఆ వీడియో స్పష్టంగా చూడవచ్చు.

వైరల్ వీడియో ఓపెన్ చేయగానే మనం ఒక భారీ డేగ( Bald eagle ) ఆకాశం నుంచి చాలా వేగంగా కిందకు దూసుకురావడం చూడొచ్చు.డేగలు చాలా బలమైన హంటర్స్.మనుషుల్ని కూడా ఇవి వదలని అంటారు.

ఈ వీడియోలో కనిపించిన డేగ ఒక పొలం లాంటి ఓపెన్ ప్లేసులో ఆడుకుంటున్న అమ్మాయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.డేగ తన గోర్లు చాచి అమ్మాయిని పట్టుకోబోయినప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా మారింది.

అయితే, ఆ అమ్మాయి చాలా తెలివిగా వ్యవహరించింది.అక్కడ ఉన్న పెద్దవాళ్ళు వెంటనే స్పందించి ఆ పిల్లను ఎత్తుకుపోకుండా కాపాడారు.

ఈ డేగలు చాలా పెద్దవిగా ఉంటాయి, వేటాడటంలో చాలా బలంగా ఉంటాయి, వాటి రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి.ఇలాంటి దాడులు చాలా అరుదుగా జరుగుతున్నా, ఈ అందమైన పక్షులు కూడా మనకు ప్రమాదాన్ని కలిగించగలవని ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది.గోల్డెన్ ఈగిల్స్‌( Golden Eagles ) ఉండే ప్రాంతాలలో పిల్లల భద్రత గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ డేగ సాధారణంగా చిన్న జంతువులను వేటాడతాయి.కానీ వాటిలోని వేటాడాలనే కోరిక పెరిగితే పెద్ద జంతువులనూ టార్గెట్ చేస్తాయి.చిన్న పిల్లలను తమ ఎరలుగా కూడా పొరపాటు పడి అటాక్స్‌ చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube