ప్రతి వ్యక్తి సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంటుంది.మనకు ప్రతిభ ఉంటే ఏదో ఒకరోజు సక్సెస్ కచ్చితంగా సొంతం అవుతుందనే సంగతి తెలిసిందే.
ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంతోమంది విద్యార్థులు పని చేస్తున్నారు.ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు( Jangareddygudem ) చెందిన బందిల సూర్య తేజశ్రీ( Bandilla Surya Tejashree ) విద్యలో చూపిన టాలెంట్ వల్ల అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ను( Free Education In America ) అభ్యసించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.
నిరుపేద కుటుంబానికి చెందిన సూర్యతేజశ్రీ తల్లి పేరు నాగమణి కాగా నాగమణి ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు.విజయవాడ ఈడ్చుగల్లులో ఉన్న బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ అండ్ నీట్ గురుకులంలో సూర్యతేజశ్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశారు.
అమెరికా ఫీల్డ్ సర్వీసెస్ సంస్థ కెన్నెడి లూగర్ యూత్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆన్ లైన్ పరీక్షను నిర్వహించడం జరిగింది.
12 విభాగాలలో ఈ పరీక్షను నిర్వహించగా 17 సంవత్సరాల సూర్యతేజశ్రీ ఈ పరీక్షలో పాల్గొని ప్రతిభ చూపారు.అమెరికా మిషిగన్ రాష్ట్రంలోని( Michigan ) హోప్కిన్ లో సంవత్సరం పాటు ఫ్రీగా డిప్లొమా కోర్సును అభ్యసించడానికి ఆమె అర్హత సాధించారు.ఆమె శిక్షణకు సంబంధించిన ఖర్చులతో పాటు ప్రయాణానికి సంబంధించిన ఖర్చులను సైతం భరించింది.
ఆగష్టు నెల 18వ తేదీన సూర్యతేజశ్రీ ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికాకు వెళ్లారు.ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా ఆమె వెళ్లి ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలను అక్కడ తెలియజేస్తూ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకునే అవకాశం సొంతం చేసుకున్నారు.ఆమె సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.సూర్యతేజశ్రీ సక్సెస్ స్టోరీ ఈతరంకు చెందిన ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.ఆమె సక్సెస్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.