ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం( Karnataka State )లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం సంచలనంగా మారిందనే చెప్పాలి.ఈ ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధి రామయ్యకు మద్దతు తెలిపేందుకు అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే బెంగళూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో తాజాగా విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ లీడర్ ఆయన రవిచంద్రన్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇక రవిచంద్రన్ లాల్ ( C K Ravichandran )మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు విలేకరుల సమావేశం లో సిద్ధి రామయ్యకు మద్దతుగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.ఈ సంఘటనకు సంబంధించి మొత్తం కెమెరాలో బంధించగా.సదస్సు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ నాయకుడు ఇలా నేలపై పడిపోవడం వెంటనే కన్నింగ్ హామ్ రోడ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రికి అక్కడివారు తీసుకొని వెళ్లారు.
అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు.ప్రస్తుతం యి ఘ్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక మరో వైవు కాంగ్రెస్ నేత మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధి రామయ్య ( Siddhi Ramaiah )కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.ఆగస్టు 17న కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధి రామయ్యను ప్రాస్టిట్యూట్ చేయడానికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది.అలాగే గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఫైల్ నిర్ణయం పై ప్రభుత్వం హైకోర్టు( High Court (ను కూడా సిద్ధి రామయ్య ఆశ్రయించారు.చూడాలి మరి చివరికి ఇది ఆ మలుపు తిరుగుతుందో.
ప్రస్తుత సమాజంలో ఇలాంటి హార్ట్ ఎటాక్ సంబంధించిన సంఘటనలు ఎక్కువవుతున్నాయి.కాబట్టి ప్రజలు ఇటువంటి వాటికీ బలివ్వకుండా వారి ఆరోగ్యం పట్ల దృష్టి వహిస్తే మరికొన్ని రోజులు ప్రశాంతంగా జీవించవచ్చు.