వైరల్ వీడియో: నదులుగా మారిన హైదరాబాద్ రోడ్లు.. నీళ్లలో తేలుతున్న వాహనాలు..

గడిచిన రెండు రోజులలో హైదరాబాద్( Hyderabad) నగరంలో భారీ వర్షాలు కురవడం అందరికీ తెలిసిన విషయమే.ఈ క్రమంలో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయిపోయాయి.

 Viral Video: Hyderabad Roads Turned Into Rivers.. Vehicles Floating In Water, He-TeluguStop.com

నగరంలో రోడ్డుమీద అంతటా కూడా నీళ్లు వరదల్లాగా మారడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలన్నా కూడా, పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి అన్న కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే.

, ఈ క్రమంలో కొన్ని స్కూల్లో పిల్లలకు సెలవులు కూడా ప్రకటించేసాయి.

అయితే, తాజాగా రాంనగర్లో( Ramanagar ) ఒక వ్యక్తి బైక్ మీద నీటికి ఎదురుగా వెళ్లాలని ప్రయత్నాలు చేశాడు.కానీ నీటి ప్రవాహానికి బైక్ కొట్టుకపోయింది.ఇది గమనించిన అక్కడి స్థానికులు వెంటనే అతని రక్షించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఇకపోతే వరదల రిత్యా హైదరాబాదు నగరాలలో పలు ప్రాంతాలలో జిహెచ్ఎంసి కూడా అలెర్ట్ ప్రకటించారు.హ‌య‌త్ న‌గ‌ర్‌, జ‌గ‌ద్గిరిగుట్ట‌, బోయిన్ పల్లి, బ‌హ‌దూర్ ప‌ల్లి, గుండ్ల‌పోచం ప‌ల్లి, పేట్ బ‌షీరాబాద్‌, అబిడ్స్‌, నాంప‌ల్లి, నాగోల్‌, అంబ‌ర్ పేట్‌, అబ్దుల్లాపూర్‌ మేట్, జీడిమెట్ల‌, సూరారం, సుచిత్ర‌, బషీర్ బాగ్, ఉప్పల్, ఫిల్మ్ నగర్, నారాయణగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, లక్డికాపుల్, బీఎన్ రెడ్డి న‌గ‌ర్‌, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట, మెహదీపట్నం, హిమాయత్ నగర్, దిల్‌ సుఖ్ నగర్, మలక్ పేట, వనస్థలిపురం ఇలా అన్ని ప్రాంతాలలో భారీగా వర్షం కురిసింది.దింతో నగరంలోని పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో అనేక చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

దింతో ప్రజలు గంటల తరబడి రోడ్లపై నిలబడి పోవాల్సి వచ్చింది .ఈ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్లోని బాప్టిస్ట్ చర్చి వద్ద విజయ్ (43) అనే రోజువారి కూలీ మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube