ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా( Social media ) వాడకం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ, కొందరు ఫేమస్ అవుతూ ఉంటే.
మరికొందరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక మరికొందరైతే సాహసాలు చేసి చివరకు ప్రాణాలు కూడా కోల్పోయిన వారు కూడా ఉన్నారు.
అయితే తాజాగా హైదరాబాద్ నగరంలో ఒక ఇద్దరు వ్యక్తులు చేసిన విన్యాసానికి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.ఇద్దరు వ్యక్తులు బైకుపై ప్రమాదకరమైన విన్యాసాలు చేసి చివరికి జైలు పాలయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
హైదరాబాదు( Hyderabad ) నగరంలో ఇద్దరు వ్యక్తులలో ఒకరు బురఖా ధరించి బైకుపై విన్యాసాలు చేస్తూ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసి పోలీసుల చెంత చేరారు.ఇలా బైకుపై విన్యాసాలు చేసిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కేసు బుక్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలియచేస్తున్నారు.
సీసీ కెమెరాల ఫుటేజ్ సహాయంతో ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీస్ అధికారులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో వీడియో చిత్రికించిన మరొక ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. బురఖా ధరించిన వ్యక్తి రోడ్డుపై అమ్మాయిలతో అనుచితంగా కూడా ప్రవర్తించాడని, అంతేకాకుండా అమ్మాయిల దగ్గరకు వెళ్లి ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వారిని భయపెట్టాడని పోలీస్ అధికారులు తెలియజేశారు.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్ వారికి తగిన బుద్ధి చెప్పారు అంటూ కామెంట్ చేస్తున్నారు.అలాగే ఇలాంటి వారికి వెంటనే తగిన శిక్ష వేయాలని పోలీస్ అధికారులకు విన్నపించుకుంటున్నారు సోషల్ మీడియా నెటిజన్స్ .