ఇటీవల ఓ టోపీ వేలం పాటలో ఏకంగా రూ.5 కోట్లు పలికింది.పైగా ఇది బంగారంతో తయారు చేసింది ఏం కాదు.మరి అదేంటి మాములు టోపీని అంత ధరకు దాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు ? అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇది సినిమాలో వాడిన ఒక టోపీ.ఇండియానా జోన్స్ సిరీస్‌లో హారిసన్ ఫోర్డ్ ( Harrison Ford )ఈ టోపీని ధరించాడు.ఈ టోపీ ఇటీవల జరిగిన ఒక వేలం పాటలో అనూహ్యంగా అధిక ధరకు అమ్ముడుపోయింది.
ఇండియానా జోన్స్ టెంపుల్ ఆఫ్ డూమ్( Indiana Jones and the Temple of Doom )అనే సినిమాలో హారిసన్ ఫోర్డ్‌కి డబుల్‌గా వ్యవహరించిన స్టంట్‌మ్యాన్ దీన్ ఫెర్రాండిని దగ్గర ఈ టోపీ ఉంది.ఆయన కలెక్షన్‌లో ఉన్న ఈ టోపీని ఇటీవల జరిగిన వేలం పాటలో అమ్మకానికి పెట్టారు.ఈ వేలం పాటలో ఈ టోపీ అంచనా కంటే రెట్టింపు ధరకు అమ్ముడుపోయింది.ఈ టోపీకి ఏకంగా 630,000 డాలర్లు (సుమారు 5 కోట్ల రూపాయలు) పలికాయి.
ఇండియానా జోన్స్ సిరీస్ చాలా ఫేమస్ సినిమా సిరీస్.ఈ సిరీస్‌లో హారిసన్ ఫోర్డ్ పెట్టుకున్న టోపీ ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారిపోయింది.
అలాంటి టోపీ కొనుగోలు చేయాలని అభిమానులు ఎంతో ఆశ పడుతుంటారు.అందుకే ఈ టోపీకి ఇంత అధిక ధర పలికింది.
ఈ టోపీని 1984లో వచ్చిన ఇండియానా జోన్స్ సినిమా కోసమే కొత్తగా రూపొందించారట! సినిమా ఈ కొత్త టోపీ ముందు వాటికంటే కొంచెం చిన్నదిగా ఉండేలా రూపొందించారు.నది దగ్గర, మంచు కొండపై వంటి చాలా ప్రత్యేకమైన సన్నివేశాల్లో హారిసన్ ఫోర్డ్ లేదా ఆయన స్టంట్‌మ్యాన్ ఈ టోపీనే వేసుకున్నారు. స్టీవెన్ స్పీల్‌బర్గ్( Steven Spielberg ) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు రెండు నామినేషన్లు పొందింది.ఈ సినిమాలోని కొన్ని ప్రత్యేకమైన దృశ్యాల కోసం ఈ టోపీని కంప్యూటర్ ద్వారా మార్చారు.