వేలంలో రూ.5 కోట్లకి అమ్ముడుపోయిన టోపీ.. దీని ప్రత్యేకత తెలిస్తే..

ఇటీవల ఓ టోపీ వేలం పాటలో ఏకంగా రూ.5 కోట్లు పలికింది.

పైగా ఇది బంగారంతో తయారు చేసింది ఏం కాదు.మరి అదేంటి మాములు టోపీని అంత ధరకు దాన్ని ఎవరు కొనుగోలు చేస్తారు ? అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇది సినిమాలో వాడిన ఒక టోపీ.

ఇండియానా జోన్స్ సిరీస్‌లో హారిసన్ ఫోర్డ్ ( Harrison Ford )ఈ టోపీని ధరించాడు.

ఈ టోపీ ఇటీవల జరిగిన ఒక వేలం పాటలో అనూహ్యంగా అధిక ధరకు అమ్ముడుపోయింది.

"""/" / ఇండియానా జోన్స్ టెంపుల్ ఆఫ్ డూమ్( Indiana Jones And The Temple Of Doom )అనే సినిమాలో హారిసన్ ఫోర్డ్‌కి డబుల్‌గా వ్యవహరించిన స్టంట్‌మ్యాన్ దీన్ ఫెర్రాండిని దగ్గర ఈ టోపీ ఉంది.

ఆయన కలెక్షన్‌లో ఉన్న ఈ టోపీని ఇటీవల జరిగిన వేలం పాటలో అమ్మకానికి పెట్టారు.

ఈ వేలం పాటలో ఈ టోపీ అంచనా కంటే రెట్టింపు ధరకు అమ్ముడుపోయింది.

ఈ టోపీకి ఏకంగా 630,000 డాలర్లు (సుమారు 5 కోట్ల రూపాయలు) పలికాయి.

ఇండియానా జోన్స్ సిరీస్ చాలా ఫేమస్ సినిమా సిరీస్.ఈ సిరీస్‌లో హారిసన్ ఫోర్డ్ పెట్టుకున్న టోపీ ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారిపోయింది.

అలాంటి టోపీ కొనుగోలు చేయాలని అభిమానులు ఎంతో ఆశ పడుతుంటారు.అందుకే ఈ టోపీకి ఇంత అధిక ధర పలికింది.

"""/" / ఈ టోపీని 1984లో వచ్చిన ఇండియానా జోన్స్ సినిమా కోసమే కొత్తగా రూపొందించారట! సినిమా ఈ కొత్త టోపీ ముందు వాటికంటే కొంచెం చిన్నదిగా ఉండేలా రూపొందించారు.

నది దగ్గర, మంచు కొండపై వంటి చాలా ప్రత్యేకమైన సన్నివేశాల్లో హారిసన్ ఫోర్డ్ లేదా ఆయన స్టంట్‌మ్యాన్ ఈ టోపీనే వేసుకున్నారు.

స్టీవెన్ స్పీల్‌బర్గ్( Steven Spielberg ) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు రెండు నామినేషన్లు పొందింది.

ఈ సినిమాలోని కొన్ని ప్రత్యేకమైన దృశ్యాల కోసం ఈ టోపీని కంప్యూటర్ ద్వారా మార్చారు.

పవన్ లో ఈ మార్పు ఊహించలేదే ?