ఇప్పటివరకు ఘట్టమనేని కుటుంబం నుంచి చాలా తక్కువ మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వారిని చేతివేళ్లపై లెక్కపెట్టవచ్చు.
సూపర్ స్టార్ మహేష్ బాబు,( Mahesh Babu ) ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ,( Superstar Krishna ) మహేష్ భార్య నమ్రత, విజయనిర్మల, మహేష్ బావ సుదీర్ ఇలా చాలా తక్కువ మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.అయితే ఇప్పుడు ఈ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కావడానికి సిద్ధంగా ఉన్నాడు.
మరో కొద్ది రోజుల్లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇంతకీ ఆ హీరో ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.
సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు( Ramesh Babu ) తనయుడు జయకృష్ణ ఘట్టమనేని( Jaya Krishna Ghattamaneni ) త్వరలోనే టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కానున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా జయకృష్ణకు సంబంధించిన ఒక ఫొటో షూట్ బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది.ఇటీవల ఆయన ఫ్యామిలీ ఫంక్షన్ లో సందడి చేశారు.అక్కడ బ్లాక్ సూట్‌లో మెస్మరైజింగ్ లో లుక్‌లో కనిపించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలు చూసిన మీడియాలో వైరల్ అవ్వడంతో జయకృష్ణ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే ఈ లుక్ లో కనిపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జయ కృష్ణ అచ్చం జూనియర్ మహేష్ బాబు లా ఉన్నారు అంటూ చాలామంది ఇప్పటికే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.ఒకరకంగా చెప్పాలంటే జయకృష్ణ మహేష్ బాబు లానే కనిపిస్తారని చెప్పవచ్చు.కాగా జయకృష్ణ ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి, డాన్స్ తదితర అంశాలపై పట్టు సాధిస్తున్నారు.
తాతయ్య కృష్ణ, తండ్రి రమేష్‌బాబు, బాబాయ్ మహేష్‌బాబు చరిష్మాను కొనసాగించడానికి, హీరోయ క్వాలిటీస్ అన్నింటి మీద పరిపూర్ణంగా పట్టు సాధించి ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడట.ఇప్పటికే జయకృష్ణ కొన్ని స్టోరీ లైన్స్ విన్నారని తెలిసింది.
త్వరలోనే తెలుగులో పేరొందిన దర్శకుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది.