సాధారణంగా కొందరిలో జుట్టు విపరీతంగా రాలిపోతుంది.కానీ కొత్త జుట్టు అనేది రాదు.
దీని కారణంగా కురులు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటాయి.మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే అస్సలు దిగులు చెందకండి.ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ ఆయిల్ ని కనుక వాడితే మీ జుట్టు రాలడం తగ్గి దట్టంగా పెరగడం స్టార్ట్ అవుతుంది.
ఒత్తైన, ఆరోగ్యమైన కురులు మీ సొంతం అవుతాయి.మరి ఇంతకీ ఆ హెయిర్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా రెండు కప్పుల వేపాకు( Neem leaves ) తీసుకొని వాటర్ తో కడిగి ఎండబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వేపాకులను లైట్ గా దంచుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut oil ) పోసుకోవాలి.అలాగే దంచుకున్న వేపాకు, రెండు టేబుల్ స్పూన్లు వాము, ఒక టీ స్పూన్ అల్లం పొడి వేసి బాగా కలిపి చిన్న మంటపై కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.కంప్లీట్ గా కూల్ అయ్యాక స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.
ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ అప్లై చేసుకున్న నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడటం వల్ల హెయిర్ రూట్స్ బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు దట్టంగా పెరుగుతుంది.పైగా ఈ ఆయిల్ ను వాడడం వల్ల చుండ్రు సమస్యకు సైతం గుడ్ బాయ్ చెప్పేయొచ్చు.
కాబట్టి ఆరోగ్యమైన దట్టమైన కురులను కోరుకునేవారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిసల్ట్ మీ సొంతం అవుతుంది.